టీవీ డిబేట్ లో పాక్ నాయకుల రభస.. ఒకరినొకరు జుట్టుపట్టి..

టీవీ డిబేట్ లో పాక్ నాయకుల రభస.. ఒకరినొకరు జుట్టుపట్టి..
ఎక్కడైనా నాయకులు ఒక్కలాగే ఉంటారేమో.. నలుగురూ చూస్తే నవ్వి పోతారన్న ఇంగితజ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంటారు.

ఎక్కడైనా నాయకులు ఒక్కలాగే ఉంటారేమో.. నలుగురూ చూస్తే నవ్వి పోతారన్న ఇంగితజ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంటారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) మరియు పాకిస్తాన్ ముస్లిం లీగ్ - నవాజ్ (PML-N) సెనేటర్ అఫ్నానుల్లా ఖాన్‌లకు మద్దతు ఇచ్చే న్యాయవాది షేర్ అఫ్జల్ మర్వాత్, టీవీ లైవ్ టెలీ కాస్ట్ లో ఒకరినొకరు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు.

పాకిస్తాన్‌లోని ఒక ప్రైవేట్ న్యూస్ ఛానెల్‌లో, ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఇద్దరు ప్యానెలిస్ట్‌ల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. షేర్ అఫ్జల్ మార్వాత్ తన కుర్చీలో నుండి లేచి అఫ్నానుల్లా ఖాన్‌ను చెంపదెబ్బ కొట్టడంతో, ఖాన్ కూడా అతడిని జుట్టు పట్టుకుని కొట్టాడు. యాంకర్ వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించి గొడవ సద్దుమణిగేలా చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story