Pakistan: కాలువలో విసిరేసి మూడేళ్ల బాలుడి హత్య
పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. సోదరుల మధ్య గొడవ ఓ చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. తన సోదరుడిపై కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి... అతడి మూడేళ్ల కుమారుడిని కాలువలో విసిరి దారుణంగా హత్య చేశాడు. హఫీజాబాద్‌లోని గర్హి గౌస్ ప్రాంతంలో నివసిస్తున్న ఇద్దరు సోదరుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సోదరుడిపై కక్షకట్టిన బాబర్ అనే వ్యక్తి.. అతడి మూడేళ్ల కుమారుడిని కాలువలో విసిరేసి హత్య చేశాడు. బాబర్ ఘాతుకం విని అతని సోదరుడు బోరుమన్నాడు.
హత్య జరిగిన మూడు రోజుల బాలుడి మృతదేహం లభ్యమైంది. సోదరుడితో గొడవల వల్లే బాబర్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సీసీ టీవీ ఆధారాలతో బాబర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాది కూడా పాకిస్థాన్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. గత ఏడాది అక్టోబర్‌లో ఓకరా ప్రాంతంలో నాలుగేళ్ల మానసిక వికలాంగురాలైన కుమార్తెను ఆమె తండ్రే కాలువలో విసిరేసి హత్య చేశాడు. హత్య అనంతరం తన కుమార్తె కిడ్నాప్ అయినట్లు డ్రామాలాడాడు. అనుమానంతో పోలీసులు తండ్రిని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించాడు. మానసిక వికలాంగురాలైన కుమార్తెను వదిలించుకోవాలని... కాలువలో విసిరేసి హత్య చేసినట్లు తెలిపాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com