24 March 2022 1:30 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / Imran Khan : ఇమ్రాన్...

Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌‌కు భారీ షాక్.. రూ. 50 వేల జరిమానా..!

Imran Khan : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌కు భారీ షాక్ తగిలింది.. అ దేశ ఎన్నికల సంఘం ఆయనకు జరిమానా విథించింది.

Imran Khan :  ఇమ్రాన్ ఖాన్‌‌కు భారీ షాక్.. రూ. 50 వేల జరిమానా..!
X

Imran Khan : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌కు భారీ షాక్ తగిలింది.. అ దేశ ఎన్నికల సంఘం ఆయనకు జరిమానా విథించింది. ఇటీవల స్థానిక ప్రభుత్వ ఎన్నికలకు ముందు స్వాత్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించడం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయనకి రూ. 50,000 జరిమానా విథించింది.

మార్చి 15న ఖైబర్-పఖ్తున్‌ఖ్వాలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న వేళ అక్కడి బహిరంగసభలో పాల్గొనద్దంటూ పాక్ ఎలక్షన్ కమిషన్ నిషేధం విధించింది. అయితే ఆ ఆదేశాలను ఇమ్రాన్ భేఖాతరు చేస్తూ.. ఇమ్రాన్ మార్చి 11న ఈ ర్యాలీని నిర్వహించారు.

ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఎలక్షన్ కమిషన్ ఇమ్రాన్‌‌కు రెండుసార్లు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులపై ప్రధాని, ప్రణాళిక, అభివృద్ధి శాఖ మంత్రి అసద్‌ ఉమర్‌ ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Next Story