PAK: పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ రద్దు

PAK: పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ రద్దు
X
ప్రతిపాదించిన పాక్‌ ప్రధాని... ఆమోదించిన అధ్యక్షుడు... 90 రోజుల్లో పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు

గడువుకు మూడు రోజుల ముందే పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ (Pakistan National Assembly) రద్దు అయింది. ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేయాలని(Pakistan's parliament dissolution) ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌(Shehbaz Sharif) పాక్‌ అధ్యక్షుడు అరిఫ్‌ అల్వీకి లేఖ రాశారు. ఈ లేఖకు అంగీకారం తెలిపిన అల్వీ బుధవారం అర్ధరాత్రి జాతీయ అసెంబ్లీను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 58 ప్రకారం జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించారు. ఈ నిర్ణయంతో పాకిస్థాన్‌ పార్లమెంట్‌ దిగువసభతో పాటు ముస్లిం లీగ్‌- నవాజ్‌(పీఎంఎల్‌-ఎన్‌)నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మూడు రోజుల ముందస్తుగానే రద్దైంది. ఇక త్వరలోనే ఆ దేశానికి ఎన్నికలు జరగనున్నాయి.


గడువు కంటే మూడు రోజుల ముందే జాతీయ అసెంబ్లీ రద్దవడంతో ఎన్నికల సంఘం 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం తన పదవీ కాలాన్ని పూర్తి చేసినట్లైతే 60 రోజుల్లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండేది. బుధవారం పాక్‌ జాతీయ అసెంబ్లీలో చివరి ప్రసంగం చేసిన ప్రధానిగా షహ్‌బాజ్‌ షరీఫ్‌(Shehbaz Sharif) జాతీయ అసెంబ్లీ రద్దు చేయాలని ప్రతిపాదించాలని అనుకుంటున్నట్లు సభ్యులకు(parliamentary leaders ) తెలిపారు. 2018 జులై 25న ఆ దేశ ఎన్నికలు జరిగాయి. 2018 ఆగస్టు 13న 15వ పాక్‌ జాతీయ అసెంబ్లీ కొలువుదీరింది. ఇక ఎన్నికలు నిర్వహించేవరకు దేశంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగనుంది.


పార్లమెంట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నా ఎన్నికల నిర్వహణ(Pakistan's general elections) మాత్రం ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. పాకిస్థాన్‌ జనాభా గణన ఫలితాలను అత్యున్నత రాజ్యాంగ సంస్థ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్(Shahbaz Sharif ) అధ్యక్షతన జరిగిన, క్యాబినెట్ మంత్రులు, ప్రావిన్షియల్ ముఖ్యమంత్రులతో పాటు ఇతర సీనియర్ అధికారులు హాజరైన కౌన్సిల్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్ (CCI) సమావేశంలో ప్రణాళికా మంత్రిత్వ శాఖ జన గణన నివేదికను ప్రవేశపెట్టింది. ఈ నివేదిక ప్రకారం పాక్ జనాభా 240.10 మిలియన్లకు చేరుకుందని వెల్లడించింది. ఈ ఆమోదంతో నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉంది. కానీ పాక్‌ ఎన్నికల సంఘం అంత వేగంగా ఆ ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికలు నిర్వహిస్తుందా అన్నది తెలియడం లేదు.

మరోవైపు పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌(Shehbaz Sharif ) ఇప్పటికే ప్రధాని పదవిపై స్పష్టతను ఇచ్చారు. త్వరలో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే తన సోదరుడు, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌(Nawaz Sharif ) మరోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తాడని స్పష్టం చేశారు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న నవాజ్‌ షరీఫ్‌ త్వరలో పాక్‌ గడ్డపై కాలు మోపుతున్నారని తెలిపారు.

Tags

Next Story