Pakistan: కిరాతకం: పాక్ లో హిందూ మహిళ హత్య.. తల నరికేసి...చర్మం వలిచేసి...

Pakistan
Pakistan: కిరాతకం: పాక్ లో హిందూ మహిళ హత్య.. తల నరికేసి...చర్మం వలిచేసి...
X
పాకిస్థాన్ లో అత్యంత కిరాతకంగా హత్యకు గురైన హిందూ మహిళ; గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న శవం; పోలీసులే చూసి జడుసుకున్న వైనం

Pakistan: కిరాతకం: పాక్ లో హిందూ మహిళ హత్య.. తల నరికేసి...చర్మం వలిచేసి...


పాకిస్థాన్ లో ఓ హిందూ మహిళ అత్యంత కిరాతకంగా హత్యకు గురైన సంఘటన శత్రుదేశంతో పాటూ భారత్ సైతం ఉలిక్కిపడేలా చేసింది. సింజ్ హోరో పట్టణంలోని ఈ ఘోరం చోటుచేసుకోగా పాక్ లోని సెనేటర్ గా ఎంపికైన తొలి హిందూ మహిళ ఈ ఉదంతాన్ని ట్వీట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.


పాకిస్థాన్ పీపుల్ పార్టీ కి చెందిన కృష్ణ కుమారి ట్వీట్ ప్రకారం.. 40ఏళ్ల దయాభెల్ అనే మహిళ అత్యంత కిరాతకంగా హత్యకు గురైందని తెలుస్తోంది. ఆమె మృతదేహం అత్యంత జుగుప్సాకరమైన పరిస్థితిలో కనిపించిందని, మెండెం నుంచి తలను వేరుచేసి... అందులో నుంచి భాగాలన్నింటినీ పెకిలించివేశారని పేర్కొన్నారు. హత్యకు గురైన మహిళకు నలుగురు చిన్నారులు కూడా ఉన్నరని కృష్ణ కుమారి ట్వీట్ లో తెలిపారు.


గ్రామ శివార్లలోని పంటపొలంలో మహిళ మృదేహాన్ని గుర్తించిగా, ప్రస్తుతం పోలీసులు దయా భెల్ కుటుంబ సభ్యులను విచారిస్తున్నారని కృష్ణకుమారి తెలిపారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.



Tags

Next Story