Pakistan: ఇది మన పాప ఫలమే.....పాక్ రక్షణా శాఖా మంత్రి

Pakistan: ఇది మన పాప ఫలమే.....పాక్ రక్షణా శాఖా మంత్రి
మనం నాటిన విత్తనమే టెర్రరిజం; భారత్ లోనూ భక్తులపై దాడి జరిగన దాఖలాలు లేవు... పెషావర్ పేలుళ్లపై పాక్ రక్షణా మంత్రి కీలక వ్యాఖ్యలు

పెషావర్ పేలుళ్లు మన పాప ఫలితమే అని పాకిస్థాన్ రక్షణా శాఖా మంత్రి ఖ్వాాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం విత్తులు నాటింది తమ దేశమేనని, దాని ఫలితమే తాజా పేలుళ్లు అని వ్యాఖ్యానించారు. పెషావర్ లోని మసీదులో జరిగన ఆత్మాహుతి దాడిలో సుమారు వంద మందికి పైగా అసువులు బాసన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశాన్ని కుదిపేయగా, దీనిపై పాకిస్థాన్ అసెంబ్లీలో మాట్లాడిన రక్షణా శాఖా మంత్రి భారత్, ఇజ్రయిల్ వంటి దేశాల్లో కూడా ప్రార్థన చేసుకుంటోన్న వారిపై దాడులు జరగలేదని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ఉగ్రవాదానికి పెంచి పోషిస్తున్నందుకు తగిన ఫలితమే ఇదంటూ వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఒక్కతాటి పైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని ప్రకటించారు. పెషావర్ లోని మసీదులో మధ్యాహ్నం ప్రార్ధన కోసం సుమారు 300 నుంచి 400 వందల మంది గుమిగుడగా , ప్రార్ధన జరుగుతున్న సమయంలో ఆత్మాహుతి దళ సభ్యుడు తనని తాను పేల్చుకోవడంతో ఆ ధాటికి నమాజ్ చేసుకుంటున్న వారు పిట్టల్లా రాలిపోయారు. వంద మందికి పైగా మృతిచెందగా, 170మంది ముస్లిం సోదరు తీవ్రంగా గాయపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story