Pakistan : మసీదులో ఆత్మాహుతి దాడి.. పోలీసులపై ప్రతీకార చర్య

Pakistan : మసీదులో ఆత్మాహుతి దాడి.. పోలీసులపై ప్రతీకార చర్య
మిలిటెంట్లపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండటంతో, పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని పోలీసు చీఫ్ ఇజాజ్ ఖాన్ తెలిపారు


పాకిస్థాన్ మసీదులో జరిగిన పేలుడు, పోలీసులపై జరిగిన ప్రతీకార చర్య అని తెలిపారు ఆ దేశ పోలీసులు. పాకిస్థాన్ పెషావర్ లోని ఓ మసీదులో పేలుడు జరిగి 100మంది చనిపోగా, 170మంది గాయపడ్డారు. అందులో 100మంది పాకిస్థాన్ పోలీసులు ఉన్నారు. 400మంది పోలీసులు మధ్యాహ్నం ప్రార్థనల కోసం ఓ మసీదుకు చేరుకోగా, బాంబు దాడి జరిగింది. మిలిటెంట్లపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండటంతో, పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని పోలీసు చీఫ్ మహమ్యద్ ఇజాజ్ ఖాన్ తెలిపారు.

పేలుడు జరిగిన వెంటనే రెస్క్యూ టీం క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. పేలుడులో గాయపడి కాళ్లు కోల్పోయిన 23ఏళ్ల కానిస్టేబుల్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఏడుగంటల పాటు మృతదేహాలు పడి ఉన్నాయని చెప్పారు. శిథిలాల కింద చిక్కుకుపోవడంతో బతికి బట్టకడతానని అనుకోలేదని అన్నారు. ఇమామ్ ప్రార్థనలు ప్రారంభించిన కొన్ని సెకన్ల తర్వాత పేలుడు సంభవించిందని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story