Pakistan: వీకీపీడియాపై ఆంక్షలు

Pakistan: వీకీపీడియాపై ఆంక్షలు
వీకిపీడియా సేవలు నిలిపివేసిన పాకిస్థాన్; దైవ దూషణ చేసినట్లు ఆరోపణలు...

తమ దేశంలో వీకిపీడియా సేవలు నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ టెలీకమ్యునికేషన్ అథారిటీ (PTA) ప్రకటించింది. వెబ్ సైట్ లో అభ్యంతర పూర్వక వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా కోరగా, వారు నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. టెలీకామ్ రెగ్యులేటర్ సైతం దైవ దూషణ చేస్తూ వీకిపీడియా కామెంట్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అభ్యంతర పూర్వ వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా పలు మార్లు వీకిపీడియాని కోరామని, ఈ మేరకు చట్టపరంగా కోర్డు నోటీసులు కూడా జారీ చేశామని PTA వెల్లడించింది. వారికి తమ తరఫు వాదన వినిపించేందుకు హియరింగ్ హాజరయ్యే అవకాశం కూడా ఇచ్చినట్లు పేర్కొంది. కానీ, వీకిపీడియా దైవ దూషణకు సంబంధించిన వ్యాఖ్యలు తొలగించలేదు సరికదా, కనీసం కోర్టు ముందర కూడా హాజరవ్వలేదు. ఉద్దేశపూర్వకంగానే వీకిపీడియా ఈ చర్యకు పాల్పడిందన్న ఆరోపణలతో 48గంటల పాటూ సదరు వెబ్ సైట్ ను బ్లాక్ చేసినట్లు పేర్కొంది. అభ్యంతరపూర్వక వ్యాఖ్యలు తొలగించిన వెంటనే వీకిపీడియా సేవలు పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది.



Tags

Read MoreRead Less
Next Story