Pakistan: ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్!

Pakistan: ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్!
ఇమ్రాన్ ఖాన్ పై నాన్ బెయిలెబుల్ అరెస్ట్ వారెంట్ జారీ; చర్యలకు ఉపక్రమించిన పోలీసులు

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు నాన్ బెయిలెబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అవ్వడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. పాకిస్థాన్ తరీఖ్ ఎ ఇన్సాఫ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఇమ్రాన్ ఖాన్ ద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు గానూ ఆయన్ను అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈమేరకు తమకు సహకారం అందించాల్సిందిగా క్వెట్టా పోలీసులు లాహోర్ పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ సైతం ప్రొటెక్టివ్ బెయిల్ కోసం లాహోర్ హై కోర్డును ఆశ్రయించారు. దీనిపై ఇంకా వివరాలు అందాల్సి ఉంది. గత వారం కూడా ఇమ్రాన్ ను అరెస్ట్ చేయకుండానే పోలీసులు వెనుదిరిగారు. అయితే అప్పుడు కేవలం నోటీసులు ఇవ్వడానికి మాత్రమే పోలీసులు వెళ్లారని అధికారులు వెల్లడించారు.

Tags

Next Story