Pakistan: అకౌంట్లోకి రూ.10 కోట్లు.. ఎలా వచ్చాయో తెలియక..

Pakistan: మనవి కాని డబ్బులు వెయ్యి, రెండు వేలు వస్తేనే ఎందుకొచ్చాయో.. ఎవరు వేశారో అని ఆరా తీసిందాకా నిద్ర పట్టదు. డబ్బులు వచ్చాయి పోలేదు కదా అనుకోడానికి లేదు.. వచ్చింది వేలు కాదు కోట్లు.. అది కూడా పది కోట్లు.. వామ్మో ఎందుకొచ్చిన గొడవ. ఏమో.. రేపన్నరోజు మన డబ్బు కూడా ఎవరైనా ఊడ్చేస్తే ఏంటి పరిస్థితి అని సదరు పోలీస్ అధికారి విషయం తెలిసి ఖంగుతిన్నాడు.
పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలోని ఓ పోలీసు అధికారి బ్యాంకు ఖాతాకు తెలియని ఖాతా నుంచి రూ.10 కోట్లు వచ్చి పడ్డాయి. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని అయ్యానని సంబర పడలేకపోయాడు పోలీసు.. ఎందుకంటే ఏ లాటరీ టిక్కెట్టో కొంటే వచ్చిన డబ్బు కాదది. పొరపాటున వచ్చిన డబ్బు.
జీతంతో సహా రూ.10 కోట్లు అతని బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు తెలియడంతో కరాచీలోని పోలీస్ అధికారులు కూడా షాక్‌కు గురయ్యారు. పోలీసు అధికారి అమీర్ గోపాంగ్ మాట్లాడుతూ, "నా ఖాతాలో ఇంత డబ్బు కనిపించడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఇంత డబ్బు మునుపెన్నడూ చూడలేదు. నా ఖాతాలో కొన్ని వేల రూపాయల కంటే ఎప్పుడూ ఎక్కువ లేవు.
బ్యాంకు వారు నన్ను సంప్రదించి నా ఖాతాలో రూ.10 కోట్లు ట్రాన్సఫర్ అయ్యాయని చెప్పడంతో విషయం తెలిసిందన్నారు. తన బ్యాంకు ఖాతా స్తంభించిపోయిందని, విచారణ చేస్తుండగా తన ఏటీఎం కార్డును కూడా బ్యాంకు 'బ్లాక్' చేసిందని తెలిపారు.
లర్కానా మరియు సుక్కూర్‌లలో జరిగిన ఇలాంటి సంఘటనలలో, ఇతర పోలీసు అధికారులు కూడా వారి బ్యాంకు ఖాతాలలో పెద్ద మొత్తంలో డబ్బు జమ అయినట్లు తెలుసుకున్నారు. ముగ్గురు పోలీసు అధికారులు ఒక్కొక్కరి ఖాతాల్లోకి రూ.5 కోట్లు జమ అయినట్లు తెలిసింది.
పోలీసు అధికారలు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ముగ్గురు పోలీసు అధికారులు తమ ఖాతాల్లోకి భారీ మొత్తంలో డబ్బు ఎలా వచ్చిందో తెలియదని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com