Pakistan: పెషావర్ లో పేలుడు.. 17మంది మృతి

Pakistan: పెషావర్ లో పేలుడు.. 17మంది మృతి
X
పాకిస్థాన్ లో భారీ పేలుడు; పెషావర్ లోని మసీదులో విధ్వంసం; 17మంది మృతి, 50 మందికి తీవ్రగాయాలు

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో సుమారు 17 మంది మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇక్కడికి సమీపంలోని ఓ మసీదులో మధ్యాహ్నం 1గం.30నిలకు ప్రార్థన జరుగుతుండగా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా, 50మందికి పైగా తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మసీదులోని ఓ వైపు పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. సంఘటనా స్థలం నుంచి విడుదలైన వీడియోలో క్షతగాత్రుల హాహాకారాలు హృదయవిదారకంగా ఉన్నాయి.

మధ్యాహ్నం ప్రార్ధనలు జరిగే సమయంలో అక్కడికి వచ్చిన నిందితుడు ఆత్మాహుతికి పాల్పడడంతో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.

Tags

Next Story