Pakistan: టర్కీకి రూ. 3కోట్లు విరాళం; మండిపడుతున్న నెజిటెన్లు

Pakistan: టర్కీకి రూ. 3కోట్లు విరాళం; మండిపడుతున్న నెజిటెన్లు
టర్కీకి భారీ విరాళమిచ్చిన గుర్తుతెలియని పాకిస్థానీ; ట్వీటే చేసిన పాక్ ప్రధాని; మండిపడుతున్న నెటిజెన్లు; తమ దేశానికి చేయలేదేమని ఏడుపులు పెడబొబ్బలు...

ప్రకృతి ప్రకోపానికి గురైన టర్కీ కనీవినీ ఎరుగని రీతిలో చిన్నాభిన్నమైంది. ఈ నేపథ్యంలో ఓ వైపు భారత్ సహా ప్రపంచ దేశాలు తమకు తోచిన సహాయం చేస్తూ టర్కీకి అండగా నిలబడుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ కు చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి టర్కీ సహాయ నిధికి 3కోట్ల యూఎస్ డాలర్లు విరాళంగా ఇచ్చేశాడు. అమెరికాలోని టర్కీ ఎంబసీకి వచ్చిన ఓ గుర్తుతెలియని పాకిస్థానీ... ఇంత పెద్ద మొత్తాన్ని టర్కీకి విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడని పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పాకిస్థాన్ లో ప్రస్తుతం అత్యంత దుర్భరమైన పరిస్థితి నెలకొందని, విదేశీ కరెన్సీ నిల్వలు 3 బిలియన్ డాలర్లకు పడిపోయిందని ఇలాంటి క్లిష్టమైన సమయంలోనూ పెద్ద మనసు గల ఓ పాకిస్థానీ 3కోట్ల యూఎస్ డాలర్లను టర్కీకి విరాళం ఇవ్వడం వల్ల మానవాళికి విధి వైపరీత్యాలను సైతం అధిగమించగలం అన్న నమ్మకాన్ని కలిగిస్తుందని ట్వీట్ చేశారు. అయితే, పాక్ ప్రధాని ట్వీట్ పై ఆ దేశస్థులు మాత్రం ఫైర్ అయ్యారు. సదరు వ్యక్తి తన సొంత దేశం నట్టేట మునిగిపోతుంటే కనిపించడంలేదా అని ట్వీట్ చేస్తున్నారు. పాకిస్థాన్ లో వరదలు వచ్చినప్పుడు అతడు ఎందుకు తనకు తోచిన సహాయం అందించలేదని దుయ్యబెడుతున్నారు. విరాళాలన్నింటినీ దోచేసే మీ లాంటి అవినీతిపరులైన రాజకీయనాయకులు ఉన్నంతవరకూ పాకిస్థాన్ ఎంబసీకి ఇలాంటి వారు రారు అని మరికొందరు ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story