Pakistan : 33 అసెంబ్లీ స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ పోటీ
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ లో జరుగనున్న అసెబ్లీ ఉప ఎన్నికల్లో 33స్థానాల్లో పోటీచేయనున్నారు. ఈ విషయాన్ని పీటీఐ సీనియర్ నాయకుడు షా మహమూద్ ఖురేషీ మీడియాకు తెలిపారు.
గతఏడాది ఏప్రిల్ లో జరిగిన అవిశ్వాస పరీక్షలో ఓటమి తర్వాత, ఆయన పార్టీకి చెందిన శసనసభ్యులను రాజీనామా చేయవలసిందిగా ఇమ్రాన్ ఖాన్ సూచించారు. దీంతో 80మంది శాసనసభ్యులు రాజీనామా చేశారు. ఈ రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ ఒకే సారి ఆమోదించలేదు. తాజాగా 33 మంది రాజీనామాలను ఆమోదించడంతో ఆ స్థానాలకు ఉపఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది.
మార్చి16న ఉపఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 33 స్థానాలకు గాను ఇమ్రాన్ ఖాన్ ఒక్కరే పోటీచేయనున్నారు. పాకిస్థాన్ లో ఒక్కరే ఎన్నిస్థానాలకైనా పోటీ చేసే అవకాశం ఉంది. గెలిచిన తర్వాత ఒకే స్థానానికి పరిమితమై మిగితా స్థానాలకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. 33 స్థానాలలో, పంజాబ్ ప్రావిన్స్ లో12, సింధ్ లో9, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 8, ఇస్లామాబాద్ లో 3, బలోచిస్థాన్ లో ఒక స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com