Pakistan : పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి, 9మంది పోలీసులు మృతి

పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 9మంది పోలీసులు మరణించారు. పాక్ లోని బలూచిస్థాన్ సిబి ప్రాంతంలో సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. పోలీసులు... ట్రక్ పై వెళ్తుండగా ఓ సూసైడ్ బాంబర్ మోటార్ సైకిల్ తో ట్రక్ ను ఢీకొట్టాడు. దీంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది పోలీసులు మరణించారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం. బలూచిస్థాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాకు తూర్పున 160 కిమీ దూరంలో దాడి జరిగినట్లు తెలిపింది.
ఈ దాడిలో 9 మంది పోలీసులు మరణించగా, ఏడు మంది పోలీసులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. పోలీసులే లక్ష్యంగా దాడి జరిగినట్లు చెప్పారు. దాడికి ఏగ్రూపు బాధ్యత మహించలేదని పోలీసులు తెలిపారు. బలూచిస్థాన్ లోని సుసంపన్నమైన గ్యాస్, ఖనిజ వనరులను ప్రభుత్వం దోపిడీ చేస్తుందని ఆరోపిస్తూ బలూచ్ గెరిల్లాలు దశాబ్ధాలుగా ప్రభుత్వంతో పోరాడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com