సంచలనం : పుల్వామా దాడిని అంగీకరించిన పాకిస్థాన్

పాకిస్థాన్ దుష్టబుద్ధి బయటపడింది. పుల్వామా దాడి తమది కాదంటూ బుకాయిస్తు వచ్చిన పాక్.. ఎట్టకేలకు అది తమ పనే అని అంగీకరించింది. అంతేకాదు అది ఇమ్రాన్ సర్కారు ఘనతగా సాక్షాత్తు పార్లమెంట్‌లో ప్రకటించుకుంది. భారత్‌లోకి దూసుకెళ్లిమరీ పుల్వామా దాడికి పాల్పడినట్లు పాక్ మంత్రి ఫవాద్ చౌదురి పార్లమెంట్‌లో వెల్లడించారు. ఫారిన్ మినిస్టర్ మహమ్మద్ ఖురేషీ... ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వివరాలను పాక్ ప్రతిపక్ష నేత అయాజ్ సాదిఖి వెల్లడించారు. ఈ నేపధ్యంలో మంత్రి ఫవాద్ చౌదురి ఈ వ్యాఖ్యలు చేశారు.
పుల్వామా దాడిలో 40 మంది భారత జవాన్లు బలయ్యారు. ఈ ఘటన తర్వాత నియంత్రణ రేఖ వద్ద భారత్, పాక్ ఫైటర్ జెట్లను మోహరించాయి. అయితే భారత్ దాడి చేయనుందని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా వణికిపోయారని, అతడికి పూర్తిగా చెమటలు పట్టేశాయని, కాళ్లు వణికాయని ప్రతిపక్ష నేత వెల్లడించారు. అంతేకాదు వెంటనే అభినందన్ ను వదిలిపెట్టాలని ఆర్మీ చీఫ్ అన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పాక్ మంత్రి పుల్వామా ఘటన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ ఘనతగా చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com