Pakistan: అరేబియా సముద్రంలో కొత్త పోర్టు..అమెరికాతో కలిసి పాకిస్తాన్ కొత్త ప్లాన్..

అమెరికాకు చాలా సన్నిహితంగా మారుతున్న పాకిస్తాన్, కొత్త పథకానికి తెరతీసింది. అమెరికాతో కలిసి అరేబియా సముద్రంలో ఓడరేవును నిర్మించాలని భావిస్తోంది. పాకిస్తాన్ ఈ ప్రతిపాదనను యూఎస్ ముందు ఉంచింది. బలూచిస్తాన్‌లోని గ్వాదర్ జిల్లాలో పస్ని పట్టణంలో ఈ సివిల్ పోర్టు ఉంటుంది. ఇది ఇరాన్‌లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్టుకు దగ్గరగా ఉంటుంది.
పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సలహాదారు ఈ ఆఫర్ ను అమెరికా ఉన్నతాధికారుల ఉంచారని తెలుస్తోంది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ విలువ 1.2 బిలియన్ డాలర్లుగా ఉంటుందని నివేదికలు పేర్కొన్నాయి. బలూచిస్తాన్‌లోని ఖనిజ సంపదను రవాణా చేయడానికి ఇది సహకరిస్తుందని పాకిస్తాన్ భావిస్తోంది.
ఇటీవల, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్‌లు ట్రంప్‌తో భేటీ అయ్యారు. బలూచిస్తాన్‌లో రేర్ ఎర్త్ ఖనిజాలపై ట్రంప్‌తో చర్చించారు. మునీర్ ఏకంగా ఒక సూట్‌కేస్‌లో రంగు రాళ్లను ట్రంప్‌కు చూపించారు. అరేబియా సముద్రంలో ఒక వేళ ఓడరేవును అమెరికా నిర్మిస్తే ఇది, ఆ ప్రాంతంలో అమెరికా ఉనికికి ఊతమిస్తుంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ పస్నీ పోర్ట్, చైనా నిర్మిస్తున్న గ్వాదర్ పోర్టుకు కేవలం 100 కి.మీ దూరంలోనే ఉంది. ఇరాన్‌లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్టుకు కేవలం 300 కి.మీ దూరంలో ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com