పాకిస్థాన్ వర్సిటీల్లో హోలీపై నిషేధం
భారత్‌పై ఎప్పుడూ విషం చిమ్మే శత్రుదేశం పాకిస్థాన్.. మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. పాక్ విశ్వ విద్యాలయాల్లో హోలీ ఆడటంపై ఆ దేశ ఉన్నత విద్యా కమిషన్ నిషేధం విధించింది. పాకిస్థానీ యూనివర్సిటీల్లో విద్యార్థులు హోలీ ఆడకూడదని ఆదేశాలు జారీ చేసింది. క్వాయిడీ ఆజామ్ విశ్వవిద్యాలయంలో హోలీ ఆడటంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కార్యకలాపాలు దేశ సామాజిక సాంస్కృతిక విలువలకు వ్యతిరేకతను సృష్టిస్తాయనీ ఆదేశాల్లో పేర్కొంది. హోలీ ఆడడం వల్ల ఇస్లామిక్ గుర్తింపును క్షీణింపజేస్తాయని తెలిపింది. క్వాయిడీ ఆజామ్ హోలీ ఘటన ఆందోళన కలిగించిందనీ, దేశ ప్రతిష్టను ప్రతికూలంగా ప్రభావితం చేసిందని పాక్ ఉన్నత విద్యా కమిషన్ పేర్కొంది. గతంలో పంజాబ్ యూనివర్శిటీలో హోలీ ఆడుతున్న విద్యార్థులపై ఓ రాడికల్ విద్యార్థి సంఘం దాడి చేసింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. పాక్ ఉన్నత విద్యా కమిషన్ తీసుకున్న నిర్ణయంపై ఆ దేశంలోని హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పాకిస్థాన్ యూనివర్సిటీల్లో హోలీపై నిషేధం
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com