తండ్రి కోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు

తండ్రి కళ్లల్లో ఆనందం చూసేందుకు కడలి గర్భంలోకి వెళ్లాడు... నాన్నతో పాటే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.. పాకిస్థాన్‌ బిలీనియర్‌ కన్నీటి కథ...

టైటానిక్‌ శకలాలను చూసేందుకు వెళ్లి మరణించిన అయిదుగురిలో పాకిస్తాన్‌కు చెందిన కుబేరులైన తండ్రీకొడుకులు కూడా ఉన్నారు. పాకిస్తాన్ బిలియనీర్ షహజాదా దావూద్ ఆయన కుమారుడు సులేమాన్ దావూద్ మినీ జలాంతర్గామీ పేలిపోవడంతో చనిపోయారు. ఈ తండ్రీకొడుకుల మరణంలో మరో కోణం ప్రపంచాన్ని ఆవేదనకు గురి చేస్తోంది. సులేమాన్ దావూద్‌కి టైటానిక్ యాత్రకు వెళ్లడం అస్సలు ఇష్టమే లేదని.. కానీ తండ్రి కోసం ఈ యాత్రకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లాడని ఆ కుటుంబానికి ఆప్తులు వెల్లడించారు. తండ్రి కోసం 'టైటాన్ సాహస యాత్రకు ఒప్పుకున్న సులేమాన్‌ దావూద్‌... ప్రయాణానికి ముందు చాలా భ‌య‌ప‌డ్డాడ‌ని అత‌ని మేనేత్త అజ్మే దావూద్ తెలిపింది. సాహ‌స‌యాత్ర చేప‌ట్టడానికి ముందు సులేమాన్ దావూద్ చాలా భ‌యాందోళ‌న‌కు గురైన‌ట్లు అజ్మే దావూద్‌ తెలిపింది. తన అన్న షహజాదా దావూద్‌కు టైటానిక్ అంటే ఇష్టమ‌ని.. ఆయనను సంతృప్తిప‌రిచేందుకు ఫాడ‌ర్స్ డే సంద‌ర్భంగా టైటాన్ ట్రిప్‌నకు వెళ్లేందుకు సులేమాన్ ఒప్పుకున్నట్లు చెప్పి ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. సులేమాన్ ఈ యాత్రకు వెళ్లేందుకు ముందు సంకోచించాడని... కానీ వారాంతంలో వచ్చిన ఫాదర్స్ డే రోజున తండ్రి కళ్లల్లో ఆనందం చూసేందుకు ఈ సాహస యాత్రకు వెళ్లాడని అజ్మే దావూద్‌ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story