Pakistan: పాక్‌లో ఆగిపోయిన పాస్‌పోర్ట్ సేవలు! రీజన్ ఏంటంటే ...

ఇప్పటికే రకరకాల ప్రాబ్లమ్స్ లో ఉన్న పాక్ ప్రజలు మరో వింత సమస్యతో సతమతమవుతున్నారు. లామినేషన్ పేపర్ కొరత కారణంగా పౌరులకు పాస్‌పోర్ట్‌ల జారీని పాకిస్థాన్ ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో విదేశాల్లో విద్య, ఉపాధి కోసం వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న వేలాది మంది పౌరులు, విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ పేపర్ ఫ్రాన్స్‌ను దిగుమతి అవుతుందని అక్కడి మీడియా చెబుతోంది. పేపర్ కొరత దేశవ్యాప్తంగా ఉందని వెల్లడించింది.
దేశం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో పాక్ ప్రజలు ఇప్పటికే నానా అవస్థలూ పడుతున్నారు. పాస్‌పోర్ట్‌ల తయారీ వినియోగించే లామినేషన్ పేపర్లు ఫ్రాన్స్ నుంచి పాక్ దిగుమతి చేసుకుంటోంది. అయితే, భారీగా బకాయిలు పేరుపోవడంతో ఫ్రాన్స్ ఎగుమతులను ఆపేసింది. పేపర్ల కొరతతో పాస్‌పోర్ట్‌లను నిలిపివేసినట్టు పాకిస్థాన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అండ్ పాస్‌పోర్ట్స్ ప్రకటనను ఉటంకిస్తూ అక్కడ మీడియా కథనాలు ప్రచురించింది. తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్‌లో విదేశీ మారకపు నిల్వలు దారుణంగా పడిపోయాయి. దీంతో విదేశీలకు రుణాలు చెల్లించలేక సతమతమవుతోంది. ఈ క్రమంలోనే ఫ్రాన్స్‌కు భారీగా బకాయి పడింది. ఉపాధి, విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన పాక్‌లోని వేలాది మంది యువకులు పాస్‌పోర్ట్‌ల కోసం పడిగాపులు కాస్తున్నారని అక్కడ మీడియా తెలిపింది. అయితే, లామినేషణ్ పేపర్ కొరతతో పాక్‌లో పాస్‌పోర్ట్ జారీని నిలిపివేయడం ఇదే మొదటిసారి కాదు. 2013లోనూ ఇటువంటి పరిణామం చోటుచేసుకుంది.
త్వరలోనే పరిస్థితిని అదుపులోకి తెస్తామని అంతర్గతవ్యవహారాల మంత్రిత్వ శాఖ మీడియా విభాగం డైరెక్టర్ ఖాదిర్ యార్ తివానా పేర్కొన్నారు. ప్రజలు మాత్రం ఆయన మాటలను విశ్వసించే స్థితిలో లేకుండా పోయారు. పాస్‌పోర్టు దరఖాస్తుల ప్రాసెసింగ్ బాగా తగ్గిపోయిందని అక్కడి ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలు చెబుతున్నాయి. గతంలో రోజుకు 3 నుంచి 4 వేల వరకూ పాస్‌పోర్టులను జారీచేసేవాళ్లమని, ప్రస్తుతం 12 నుంచి 13 కూడా జారీచేయడంం లేదని పెషావర్ పాస్‌పోర్ట్ కార్యాలయం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ పరిస్థితి ఎప్పుడు మెరుగుపడుతుందో తనకు తెలియదని పేరు చెప్పడానికి నిరాకరించిన ఆ అధికారి అన్నారు. పౌరు మరో రెండు నుంచి మూడు నెలల పాటు వేచి చూడక తప్పదని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com