Afghanistan: భారత్ గోధుమలు బాగున్నాయి.. పాకిస్తాన్‌వి చెత్తగా.. : తాలిబన్ అధికారి

Afghanistan: భారత్ గోధుమలు బాగున్నాయి.. పాకిస్తాన్‌వి చెత్తగా.. : తాలిబన్ అధికారి
Afghanistan: భారతదేశం పంపిన గోధుమల నాణ్యతను ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో నాణ్యత లేని గోధుమలను విరాళంగా ఇచ్చినందుకు పాకిస్తాన్‌ను దూషిస్తున్నారు తాలిబాన్ అధికారి.

Afghanistan: పాకిస్థాన్ గోధుమల నాణ్యతపై తాలిబాన్ అధికారి ఫిర్యాదు చేస్తున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో చక్కర్లు కొడుతోంది. "పాకిస్తాన్ విరాళంగా ఇచ్చిన గోధుమలు తినదగినవి కాదు: తాలిబాన్ అధికారి" అని ఆఫ్ఘన్ జర్నలిస్ట్ అబ్దుల్హాక్ ఒమెరీ తాలిబాన్ అధికారి వీడియోను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు.

"మంచి నాణ్యమైన గోధుమలు" ఇచ్చినందుకు ఆఫ్ఘన్ ప్రజలు ట్విట్టర్‌లో భారతదేశానికి ధన్యవాదాలు తెలిపారు. "ఆఫ్ఘన్ ప్రజలకు అందిస్తున్న మీ నిరంతర మద్దతుకు ధన్యవాదాలు. మాతో మీ స్నేహ సంబంధాలు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి. జై హింద్" అని హమ్దుల్లా అర్బాబ్ ట్వీట్ చేశారు.

ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్‌ ఎప్పుడూ సాయం చేస్తూనే ఉంది అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు. అయితే పాకిస్తానీ గోధుమల నాణ్యతను తప్పుబట్టి అనవసర వ్యాఖ్యలు చేసిన తాలిబాన్ అధికారిని పదవి నుండి తొలగించారు. గత నెల నుంచి భారతదేశం ఆఫ్ఘన్ ప్రజలకు మానవతా సాయంగా గోధుమలను పంపడం ప్రారంభించింది.

2వేల మెట్రిక్ టన్నుల గోధుమలను తీసుకు వెళ్లిన ట్రక్కు గురువారం అమృత్‌సర్‌లోని అత్తారి నుండి ఆఫ్ఘనిస్తాన్‌లోని జలాలాబాద్‌కు బయలుదేరిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ఆఫ్ఘన్ ప్రజల కోసం భారతదేశం తన వంతు సాయంగా 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలను పంపుతామని వాగ్ధానం చేసింది. అందులో భాగంగానే రెండో విడత 2వేల మెట్రిక్ టన్నుల గోధుమలను పంపింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతో ప్రత్యేక సంబంధానికి భారత్ కట్టుబడి ఉంది అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఒక ట్వీట్‌లో తెలిపారు.

Tags

Next Story