Pakistan Economic Crisis: పెట్రోల్ రూ.249, పాలు రూ.210, చికెన్ రూ.700

పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. పాకిస్థాన్ కరెన్సీ విలువ పడిపోవడం, చమురు దిగుమతుల వ్యయం పెరగడం వంటి కారణాలతో కొంత కాలంగా పాకిస్థాన్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం పాకిస్థాన్ లో పెట్రోల్ ధర రూ. 249, డీజిల్ ధర 262గా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం దృష్ట్యా పాకిస్థాన్ ప్రభుత్వం ఫ్యూయల్ పై మరింత భారం మోపనుంది. ఫిబ్రవరి 16నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.32 పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పెట్రోల్ ధరలు 12.8 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కిరోసిన్ ఆయిల్ ధర 14.8 శాతం లేదా లీటరుకు 28 రూపాయలు పెరుగుతుందని అంచనా. దీంతో కిరోసిన్ లీటరుకు రూ.217కు చేరుకుంటుంది. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 15వరకు పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.35ల చొప్పున పెంచింది. పెట్రోల్, డీజిల్ పైనే కాకుండా పాలు, మాంసం సహా ఇతర నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం లీటరు పాలు రూ.210, చికెన్ కేజీ 700-800 ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com