EASA: పాకిస్థాన్‌లో విమాన ప్రయాణమా.. తస్మాత్ జాగ్రత్త

పాకిస్థాన్‌లో గగనతల ప్రయాణంపై యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ జారీ చేసిన హెచ్చరిక( issued a warning ) సంచలనంగా మారింది. తక్కువ ఎత్తు నుంచి ప్రయాణించి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని ప్రపంచ దేశాలకు హెచ్చరించింది. దీనిపై పాకిస్థాన్ భగ్గుమంది. అసత్య ప్రచారమంటూ కొట్టిపారేసింది.
పాక్‌లోని (Pakistan) కరాచీ (Karachi), లాహోర్ (Lahore) నగరాలపై విమానాలు ఎగరడం ప్రమాదకరమని( airspace over Karachi and Lahore ) యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ(EASA) ఏజెన్సీ హెచ్చరిక జారీ చేసింది. ఈ నగరాలపై తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలకు (Flights) ప్రమాదం( unsafe) పొంచి ఉందని EASA హెచ్చరించింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో కొన్ని హింసాత్మక మూకలు ఉన్నాయని.. వారి వద్ద విమానయాన నిరోధక ఆయుధాలు ఉన్నాయని యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ గుర్తు చేసింది. మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉగ్రమూకల చేతిలో ఉండడం వల్ల పౌర విమానయానానికి నిరంతర ముప్పు పొంచి ఉందని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దీని ఫలితంగా 260 అడుగుల కంటే తక్కువ ఎత్తులో ప్రయాణం చేయడం ప్రమాదకరమని ఓ ప్రకటనలో EASA హెచ్చరించింది.2024 జనవరి 31 వరకు ఈ సూచనలు వర్తిస్తాయని ఈయూ అడ్వైజరీ వెల్లడించింది.
యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ సంస్థ సలహాను పాకిస్థాన్ పౌర విమానయాన అథారిటీ కొట్టిపడేసింది. అన్ని రకాల విమానయాన కార్యకలాపాలకు తమ గగనతలం సురక్షితమైనదని ప్రకటించింది. తమ దేశ గగనతలం చాలా సురక్షితమైనదని, ఎలాంటి భద్రతాపర లోపాలు లేవని ద ఎయిర్‌క్రాఫ్ట్ ఓనర్స్ అండ్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ పాకిస్థాన్ (AOOA) స్పష్టం చేసింది. తమ గగనతలం చొరబాట్ల నుంచి రక్షణ కలిగి ఉందని వెల్లడించింది. తక్షణమే EASA జారీ చేసిన భద్రతా సర్క్యులర్‌ను ఉప సంహరించుకోవాలని సూచించింది. భయాన్ని ప్రేరేపించి పాకిస్థాన్ ఆర్థిక కార్యకలాపాలను దెబ్బ కొట్టేందుకు ఇలా చేస్తున్నారని మండిపడింది.
పాకిస్థాన్‌లో తీవ్రవాద దాడుల( terrorist attacks in Pakistan) ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలోనే యూరోపియన్ ఎయిర్ సేఫ్టీ ఏజెన్సీ ఈ హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లో ప్రస్తుత భద్రతా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఉగ్రమూకలు వరుస దాడులకు పాల్పడుతున్నాయని అందుకే EASA ఈ హెచ్చరిక జారీ చేసిందని విమానయాన నిపుణులు అంటున్నారు. ఇటీవలే ఓ రాజకీయ పార్టీలో జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 44 మంది మరణించగా, 200 మందికిపైగా గాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com