30 Oct 2020 1:34 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / మరోసారి బయటపడిన...

మరోసారి బయటపడిన పాకిస్థాన్ దుష్టపన్నాగం

మరోసారి బయటపడిన పాకిస్థాన్ దుష్టపన్నాగం
X

పాకిస్థాన్ దుష్టపన్నాగం మరోసారి బయటపడింది. భారత్‌లో 40మంది సీఆర్ పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న పుల్వామా దాడి తామే చేశామంటూ పాకిస్తాన్ తెలిపింది. ఇది తమ విజయంగా చెప్పుకుంది.

పాకిస్థాన్ మంత్రి ఫవద్ చౌదరి పాక్ జాతీయ అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‌ను వారిగడ్డపైనే దెబ్బాకొట్టామని, పుల్వామాలో విజయం సాధించామంటూ తెలిపాడు. ఇమ్రాన్ నాయకత్వంలో పాక్ విజయం సాధించిందని గొప్పలు చెప్పాడు. దీంతో పాకిస్తాన్ దుష్టపన్నాగం మరోసారి ప్రపంచానికి తెలిసినట్లైంది.

పుల్వామా ఘటన అనంతరం భారత్ -పాకిస్థాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఇరుదేశాల వైమానిక పోరులో శత్రుదేశాల విమానాలను తరిమికొట్టే క్రమంలో భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ పాక్ సైన్యానికి చిక్కాడు. ఈ సందర్భంగా ఆయనను విడుదల చేసే విషయంలో పాక్ ఆర్మీచీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా గజగజ వణికిపోయారట. శరీరమంతా చెమటలు పట్టి కాళ్లువణికాయట. ఈ విషాయాన్ని పాకిస్థాన్ ముస్లీం లీగ్ నేత అయాజ్ సాదిక్ ఆదేశ పార్లమెంట్‌లో తెలిపారు. అభినందన్‌ను విడుదల చేసే వ్యవహారంలో పాక్ ఆర్మీచీఫ్ బజ్వా, విదేశాంగ మంత్రి ఖరేషికీ మధ్య జరిగిన సంభాషణను సాదిక్ పార్లమెంట్‌లో వెల్లడించారు. ఆనాటి సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తిరస్కరించాడని వెల్లడించారు. ఆర్మీచీఫ్ శరీరమంతా చెమటలు పట్టి, వణుకుతూ సమావేశ గదిలోకి వచ్చాడన్నాడు. చర్చల అనంతరం .. పాక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షా మోహ్‌మూద్ ఖురేషీ .. మీకు పుణ్యముంటుంది. అభినందన్‌ను వెళ్లనీయండి.. లేదంటే భారత్ రాత్రి 9 గంటలకు మన మీద దాడిచేసేందుకు సిద్దంగా ఉందని అన్నట్లు సాదిక్ తెలిపారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం అభినందన్‌ను విడుదల చేసినట్లు తెలిపారు.

అంతేకాదు.. పాక్ పార్లమెంటు మోదీ.. మోదీ నినాదాలతో దద్దరల్లింది. బలూచిస్తాన్‌కు చెందిన ఎంపీలు మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. దీంతో పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఖురేషీకి చిర్రెత్తుకొచ్చింది. ప్రసంగం మధ్యలోనే ఆపేసి సభ నుంచి వాకౌట్‌ చేసిన వెళ్లిపోయారు. బలూచిస్తాన్‌ ఉద్యమం గురించి ఖురేషి ప్రసంగిస్తుండగా... ఎంపీలు మోదీని పొగుడుతూ నినాదాలు చేశారు. అటు మంత్రి ప్రసంగానికి పదేపదేల అడ్డు తగిలారు. ఆ ఎంపీల హృదయాల్లో మోదీ చొచ్చుకుని పోయారని ఖురేషీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీనికి పాక్‌కు చెందిన జైష్‌-ఎ-మోహమ్మద్‌ తీవ్రవాద సంస్థ కారణమని దాని స్థావరంపై భారత్‌ వాయుసేనదాడిచేసి ధ్వంసం చేసింది. ఫిబ్రవరి 27, 2019న కశ్మీరులో పాక్‌ విమానం చొరబాటును అడ్డుకోవటంలో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ అసమాన ప్రతిభ ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన వైమానిక పోరులో పాక్‌కు చెందిన ఓ ఎఫ్‌-16 యుద్ధవిమానాన్ని తన మిగ్‌-21 విమానంతో వెంటాడి మరీ కూల్చివేశారు. అయితే ఈ ఘర్షణలో తన విమానం కూడా కూలిపోవటంతో భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ అత్యవసరంగా పాక్‌ భూభాగంలో దిగాడు. పాక్ సైన్యం అతన్ని అదుపులోకి తీసుకుంది. ఇరుదేశాల చర్చల అనంతరం మార్చి 1న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగించారు.

Next Story