అంతర్జాతీయం

పెరిగిన ధరలు ... ప్రజలు తక్కువ తింటే మంచిది : మంత్రి షాకింగ్ కామెంట్స్..!

Ali Amin Gandapur : కరోనా... ప్రపంచంలోని చాలా దేశాలను వణికించింది...కరోనా తర్వాత చాలా దేశాలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

పెరిగిన ధరలు ... ప్రజలు తక్కువ తింటే మంచిది : మంత్రి షాకింగ్ కామెంట్స్..!
X

Ali Amin Gandapur : కరోనా... ప్రపంచంలోని చాలా దేశాలను వణికించింది...కరోనా తర్వాత చాలా దేశాలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అందులో పాకిస్తాన్ ఒకటి. పాక్‌‌లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెరుగుతున్న నిత్యావసర ధరల పైన ఆ దేశ కేంద్ర మంత్రి అలీ అమిన్ గందపూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ధరల పెరుగుదల దృష్ట్యా.. ప్రజలు తక్కువ తినాలని సూచించారు. ద్రవ్యోల్భణం గురించి ఓ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన మంత్రి ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చక్కెర, పిండి పదార్థాల ధరలు పెరుగుతున్నందున ప్రజలు వీటిని తినడం తగ్గిస్తే మంచిదని అన్నారు. ద్రవ్యోల్బణం గురించి చెబుతూ ప్రజలు పిల్లలను బానిసత్వం నుంచి కాపాడటానికి త్యాగాలు చేయాలని మంత్రి కోరారు. మంత్రి మాట్లాడిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Next Story

RELATED STORIES