Pakistan Mosque Blast: పోలీస్ డ్రెస్ లో వచ్చి తనని తాను పేల్చుకున్నాడు

Pakistan Mosque Blast: పోలీస్ డ్రెస్ లో వచ్చి తనని తాను పేల్చుకున్నాడు
X
పేషావర్ పేలుళ్లలో కీలక సమాచారం; పోలీస్ డ్రెస్ లో వచ్చిన ఆత్మహుతి దళ సభ్యుడు...
పాకిస్థాన్ లోని పెషావర్ లో చోటుచేసుకున్న ఉగ్రదాడిలో కీలక సమాచారం బయటకు వచ్చింది. సుమారు 100 మందిని పొట్టన పెట్టుకున్న ఈ దాడికి పాల్పడ్డ ఆత్మాహుతి దళ సభ్యుడు పోలీసు యూనిఫార్మ్ లో మసీదు లోపలికి వచ్చినట్లు తెలుస్తోంది. హెల్మెట్, మాస్క్ ధరించి ఉన్న ఉగ్రవాది.. 400మంది ప్రార్థన చేసుకుంటోన్న సమయంలో తనని తాను పెల్చుకున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో 27మంది పోలీసులు కూడా ఉన్నరాని ఖైబర్ పోలీస్ అధికారి మోజంజా అన్సారీ వెల్లడించారు. ఉగ్రవాది పోలీస్ యూనిఫార్మ్ లో ఉండటంతో భద్రతా అధికారులు అతడిని సరిగ్గా చెక్ చేయకుండానే లోపలికి అనుమతించినట్లు అన్సారీ అంగీకరించారు. సంఘటనా స్థలంలో అత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాది తల దొరికినట్లు వెల్లడించారు. దాని ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్ ను అధ్యాయనం చేయగా నిందితుడు పోలీస్ యూనిఫార్మ్ లో మసీదు లోపలికి ప్రవేశించాడని కొనుగున్నట్లు తెలిపారు.

Tags

Next Story