Pakistan Mosque Blast: చేతుల కట్టేసి... మృగాలకు ఎరవేశారు...

Pakistan Mosque Blast: చేతుల కట్టేసి... మృగాలకు ఎరవేశారు...
పెషావర్ మసీదు పేలుడుపై స్పందించిన పోలీస్ అధికారులు; ప్రభుత్వమే తమని వదిలేసిందంటూ బావురుమంటోన్న పోలీసులు

పాకిస్థాన్ లోని మజీద్ లో చోటుచేసుకున్న పేలుడులో మృతుల సంఖ్యను పునఃపరిశీలించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తాజా లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 84 మాత్రమేనని ప్రకటించింది. అయితే ఇందులో 83మంది పోలీసులేనని తెలుస్తోంది. గత కొన్ని దశాబ్దాల్లో పాకిస్థాన్ లో ఈ తరహాలో జరిగిన దాడిలో భారీ ప్రాణ నష్టం జరగడం ఇదే ప్రథమం అని తెలుస్తోంది. మరోవైపు భారీ సంఖ్యలో తమ సహచరులను కోల్పోయిన పోలీసులు ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్నారు. ఈ యుద్ధంలో ఫ్రంట్ లైన్ లో ఉండి పోరాడుతున్న తమని ఫ్రభుత్వం గాలికి వదిలేసిందని దుయ్యబెడుతున్నారు. ప్రాణాలకు తెగించి స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలకు గస్తీ కాస్తున్న తమకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ చేతులు కట్టేసి రాక్షకులకు ఆహారంగా వేస్తున్నారని ఇనాయత్ ఉల్లా అనే పోలీసు అధికారి కన్నీటి పర్యంతం అయ్యాడు. దాడి జరిగన మసీదు లోపల గంటల కొద్దీ శిధిలాలను తవ్వి సహచరుల మృతదేహాలను వెలికి తీసిన ఇనాయత్ ఇదే ప్రభుత్వం మా కిచ్చిన బహుమతి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోజు విధులకు వచ్చేముందు ఇంటిల్లపాదినీ మళ్లీ చూస్తామో లేదో అన్న భయంతోనే ఇంటి బయట అడుగుపెడతామని తమ గోడు వెళ్లబోసుకున్నాడు. మరోవైపు పాకిస్థాన్ లోని తరీఖ్ ఎ తాలిబన్ పాకిస్థాన్ అనే తీవ్రవాద సంస్థే ఈ దాడులకు పాల్పడిందని సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story