Pakistan: ఖర్చులని తగ్గించుకోవాలని పాక్ నిర్ణయం..

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్తాన్ ఖర్చుల్ని తగ్గించుకోవడానికి నానా బాధలు పడుతోంది. దుబారా ఖర్చులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పొదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ‘రెడ్ కార్పెట్’ల వినియోగాన్ని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేవలం దౌత్యపరమైన కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని సూచించారు. ఫెడరల్ మినిష్టర్స్, సీనియర్ అధికారుల పర్యటన సందర్భంగా రెడ్ కార్పెట్ వేయడంపై పాక్ ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు.
పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉంది. పొదుపు చర్యల్లో భాగంగా పీఎం షెహబాజ్ షరీఫ్, క్యాబినెట్ మంత్రులు జీతాలు, ఇతర ప్రోత్సహాకాలను వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి ముందు పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ కూడా తన జీతాన్ని వదులుకునేందుకు సిద్ధమైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
అధికారిక కార్యక్రమాల్లో వినియోగించే ఎర్రతివాచీపై పాక్ ప్రధాని నిషేధం విధించినప్పటికీ.. విదేశీ అధికారుల పర్యటన సమయాల్లో ఈ సంప్రదాయం కొనసాగనుంది. రెడ్ కార్పెట్ వాడకాన్ని తొలగించడం ద్వారా నిధుల్ని ఆదా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు.. దేశ ఖజానాకు భారం కాకూడదని తమ జీతాలు, ప్రోత్సాహకాలను వదులుకొనేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్, కేబినెట్ సభ్యులు సిద్ధమయ్యారు. దేశ ఆర్థిక నిర్వహణను మెరుగుపరచడంలో భాగంగా పాక్ అధ్యక్షుడు ఆసీఫ్ అలీ జర్దారీ జీతం తీసుకోనని గత నెలలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. 2023లో పాక్ తన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొందని హ్యూమన్ రైట్స్ వాచ్ (HRW) పేర్కొంది. పేదరికం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆరోగ్యం, ఆహారం.. లాంటి ప్రజల కనీస హక్కుల్ని పాక్ పాలకులు హరించివేశారని ఆక్షేపించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com