Imran Khan : అవిశ్వాసంపై ఓటింగ్ ... సిద్ధమైన ఇమ్రాన్‌ఖాన్ సర్కార్...!
Imran Khan : విపక్షాలతో పాటు సొంత పార్టీ అసమ్మతి నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ భవితవ్యం త్వరలో తేలిపోనుంది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కోసం పాకిస్థాన్ పార్లమెంట్ దిగువసభ అయిన నేషనల్ అసెంబ్లీ ఈ నెల 25న సమావేశం కానుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో తిరుగుబావుటా ఎగరవేసిన సొంత పార్టీ నేతలను దారికితీసుకొచ్చే ప్రయత్నాలను ఇమ్రాన్ మొదలు పెట్టారు.
పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన వంద మంది సభ్యులు ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. దేశంలో ఆర్థిక సంక్షోభానికి, ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నేషనల్ అసెంబ్లీ కార్యదర్శికి మార్చి 8న తీర్మానాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25న శుక్రవారం 11 గంటలకు 41వ సెషన్ ప్రారంభమవుతుందని స్పీకర్ అసద్ ఖాజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన 14 రోజులకే ఓటింగ్ నిర్వహించాలి. ఆ లెక్కన ఇవాళే జాతీయ అసెంబ్లీ సమావేశం అవ్వాలి. అయితే, ప్రత్యేక పరిస్థితుల్లో జాతీయ అసెంబ్లీ సమావేశాలు ఆలస్యం అవ్వొచ్చని పాక్ హోంమంత్రి షేర్ రషీద్ తెలిపారు. ఇవాళ పార్లమెంట్ హౌస్‌లో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ సదస్సు జరగుతుంది.
రెండ్రోజులు జరిగే ఈ సమావేశానికి 50 దేశా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ సదస్సు జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని, దీన్ని విపక్షాలు ఆటంకం తలపెట్టకూడదని రషీద్ విజ్ఞప్తి చేశారు. అయితే, తొలుత సెషన్ కోసం పట్టుబట్టిన విపక్షాలు.. తర్వాత సదస్సు నేపథ్యంలో తన కొంత మెత్తబడ్డాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com