Pakistan: పాక్ లోని ఉగ్ర స్థావరాలపై ఇరాన్ దాడి..

పాక్‌లోని బలూచీ మిలిటెంట్ గ్రూప్ జైష్ అల్ అదిల్‌కు చెందిన రెండు ప్రధాన స్థావరాలపై ఇరాన్ సైన్యం దాడులు చేసింది. బలూచీ మిలిటెంట్లు తమ సైన్యంపై దాడి చేయడంతో ఈ ప్రతిదాడులు చేసినట్లు ఇరాన్ తెలిపింది. దీంతో ఇరాన్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇరాన్ దాడులపై పాకిస్థాన్ స్పందించింది. పొరుగు దేశం చేసిన దాడుల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. అలాగే, మరో ముగ్గురికి గాయాలయ్యాయని పేర్కొంది. ఇరాన్ చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిందని పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ ఆమోదయోగ్యం కాని చర్యలకు పాల్పడిందని చెప్పింది.
దీనికి ఆ దేశం తీవ్ర పరిణామాలకు ఎదుర్కోవాల్సి ఉంటుందని పాక్ హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ రాయబారిని పిలుపించుకొని పాకిస్థాన్ విదేశాంగ శాఖ నిరసనను తెలిపింది. తమ దేశ గగనతల హక్కులను ఉల్లంఘిస్తూ, సౌర్వభౌమాధికారాన్ని సవాలు చేశారని చెప్పింది. కొన్ని రోజుల వ్యవధిలో ఇరాన్ దాడులను ఎదుర్కొన్న మూడో దేశం పాకిస్థాన్. ఇటీవలే ఇరాక్, సిరియాపై ఇరాన్ దాడులు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com