Pakistan: మగపిల్లాడు పుట్టాలంటే.. తలలో మేకు కొట్టాలి.. భూత వైద్యుడి మాటలు నమ్మి..

Pakistan: శాస్త్రవిజ్ఞానం పురోగతి సాధిస్తున్నా మనిషి మూఢనమ్మకాల మాయలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముందు వెనుకా ఆలోచించకుండా మాన ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. భూతవైద్యులు, బాబాలు చేసే అరాచకాలు రోజూ వెలుగు చూస్తున్నా ఇంకా ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా వెలుగు చూస్తూనే ఉన్నాయి.
పాకిస్తాన్‌లో పెషావర్‌లో నివసిస్తున్న ఒక గర్భిణికి ముగ్గురు ఆడపిల్లలు. మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనన్న బెంగతో భూతవైద్యుడిని సంప్రదించింది. అప్పటికే గర్భం దాల్చిన ఆమె అల్ట్రాసౌండ్ ద్వారా మళ్లీ ఆడపిల్ల పుట్టబోతోందని తెలుసుకుంది..
భూత వైద్యుడు తన వైద్యం ద్వారా అబ్బాయి పుడతాడని చెప్పిన మాటలు నమ్మింది. అయితే ఆమె బలహీనతను ఆసరాగా తీసుకుని తలపై మేకు కొడితే మగపిల్లాడు పుడతాడని చెప్పాడు.. దానికి ఆమె అంగీకరించడంతో సుత్తితో గర్భిణి తలపై మేకు కొట్టడానికి ప్రయత్నించాడు.
ఈ క్రమంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది. నొప్పి భరించలేకపోయింది. భూత వైద్యుడు మేకు తీయడానికి ప్రయత్నించినా అది తలలోనే ఇరుక్కుపోయింది. కుటుంబసభ్యులు గర్భిణిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి తలలోని మేకును బయటకు తీశారు. దీంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ మేరకు పెషావర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు.
క్యాపిటల్ సిటీ పోలీస్ పెషావర్ (CCPO) అబ్బాస్ అహ్సాన్ జియో న్యూస్ టీవీతో మాట్లాడుతూ, బాధితురాలి సహాయ అధికారులు మహిళకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి మరియు సంఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలని ఆదేశించారని, "ఆమె భర్త మరియు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. నేరస్థులు పాల్గొన్నారు."
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com