కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్, ముగ్గురు హతం

భారత్ లో చొరబాటుకు 4వ ప్రయత్నం విఫలం

గత 2 వారాలుగా భారత భూభాగం లోకి చొరబడడానికి పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఎల్‌ఓసి దాటి భారత్ వైపు చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు సాయుధ పాకిస్తాన్ చొరబాటుదారులను భద్రతా దళాలు కాల్చిచంపాయని ఆర్మీ ప్రకటించింది. చొరబాటుదారులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక సైనికుడు కూడా గాయపడ్డాడు.






సరిహద్దు కంచె దాటి ముగ్గురు పాకిస్తానీ తీవ్రవాదులు ముందుకు రావడానికి ప్రయత్నించారు. పోలీసు వారిని ఆపే ప్రయత్నంలో భాగంగా కాల్పులు మొదలుపెట్టారు. వెంటనే తీవ్రవాదులు తిరిగి కాల్పులు జరుపుతూ, పాకిస్తాన్ వైపు పరిగెట్టడం మొదలుపెట్టారు. దీంతో పోలీసులు పూర్తి స్థాయిలో కాల్పులు చేయాల్సి వచ్చింది. అయితే, భారత సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించారని, ఒకరు గాయపడ్డారని పాకిస్థాన్ ఆర్మీ పేర్కొంది. ఇంటెలిజెన్స్ ఆధారిత కౌంటర్-ఇన్‌ఫిల్ట్రేషన్ 'ఆపరేషన్ రేషమ్' ను సైన్యం, పోలీసులు సంయుక్తంగా ప్రారంభించింది. చొరబాటుదారులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక సైనికుడు కూడా గాయపడ్డాడు.

మచిల్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భారత భద్రతా బలగాలు భగ్నం చేయడంతో శుక్రవారం నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. జూన్ 16న, కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి ఆఫ్ఘన్ కు సంబంధిన వ్యక్తి నాయకత్వం వహించిన సంస్థకు చెందిన ఐదుగురు భారీగా సాయుధులైన విదేశీ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఇక గత నెల, కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నంలో ఇద్దరు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్‌లో మరణించారు.





మరోవైపు పారామిలటరీ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నంలో శనివారం నైరుతి పాకిస్తాన్‌లో ఓ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు గాయపడ్డారని పాకిస్తాన్ మీడియా ప్రకటించింది. టర్బాట్‌లో ఈ పేలుడు జరిగిన తరువాత ఒక మహిళా మానవ బాంబుగా మారి ఈ ఘటనకు పాల్పడినట్టుగా సమాచారం.

ఇందులో వాహనం స్వల్పంగా దెబ్బతినగా, , గాయపడిన వారిలో మహిళా పోలీసు కూడా ఉన్నారు. ఈ దాడికి తక్షణమే ఎవరూ బాధ్యత వహించలేదు, అయితే గతంలో ఇలాంటి దాడులు బలూచ్ వేర్పాటువాద గ్రూపులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story