Imran Khan: ఇమ్రాన్​కు మరో ఏడేండ్ల జైలు శిక్ష

Imran Khan: ఇమ్రాన్​కు మరో ఏడేండ్ల జైలు శిక్ష
వివాహ చట్టం ఉల్లంఘన కేసులో కోర్టు తీర్పు

మరో వారంలో పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు జరుగనుండగా ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. ఇప్పటికే పలు కేసుల్లో జైలు శిక్ష పడగా తాజాగా ఇస్లాం వివాహ చట్టం ఉల్లంఘన కేసులోనూ శిక్ష పడింది. ఇమ్రాన్‌, ఆయన భార్య బుష్రా బీబీకి ఏడేండ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.

ఇప్పటికే ఇమ్రాన్ పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు ప్రభుత్వ రహస్యాలు లీక్ చేసినందుకు పదేళ్లు, ప్రభుత్వ గిఫ్ట్‌లను విక్రయించినందుకు బుష్రాఖాన్‌తో పాటుగా 14 ఏళ్ల జైలు శిక్షలు విధిస్తూ కోర్టులు ఇటీవల తీర్పు చెప్పిన విషయం తెలిసిందే, కాగా తాజా కేసులో ఇరువురికీ ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల(పాక్ కరెన్సీ)చొప్పున జరిమానా కూడా విధించినట్లు ఎఆర్‌వై న్యూస్ తెలిపింది.

బుష్రా తన మాజీ భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత ఇచ్చి ఇమ్రాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకోవడానికి ఇస్లాం మత సంప్రదాయాల ప్రకారం వేచి ఉండాల్సిన సమయాన్ని పూర్తి చేయకుండానే ఆయనను వివాహం చేసుకున్నారనేది ఆమెపై ఉన్న అభియోగం. తొలి సారి పాక్ ప్రధానిగా ఎన్నిక కావడానికి ఏడు నెలల ముందు 2018 జనవరిలో రహస్యంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఇద్దరూ ‘నిఖా’ ఒప్పందంపై సంతకాలు చేశారు.ఈ ఇద్దరూ గడువు ముగియడానికి ముందే వివాహం చేసుకున్నారా అనే దానిపై వివాదం ఉంది. జనవరిలో జరిగిన పెళ్లిపైవచ్చిన వార్తలను మొదట ఖండించిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్‌ఎ ఇన్సాఫ్(పిటిఐ) కొద్దివారాల తర్వాత దాన్ని ధ్రువీకరించింది. అయితే తాము ఏ తప్పూ చేయలేదని ఈ ఇరువురూ వాదిస్తున్నారు. ఇమ్రాన్ ప్రస్తుతం రావల్పిండిలోని జైల్లో ఉండగా, ఆయన భార్య మాత్రం ఇస్లామాబాద్‌లోని తమ భవనంలోనే శిక్షాకాలం గడపడానికి కోర్టు అనుమతించింది.

71 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్‌కు అధికారిక రహస్యాల లీకేజి కేసులో 10 ఏళ్లు, ప్రభుత్వ కానుకల అక్రమ అమ్మకం కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. తాజాగా చట్ట వ్యతిరేక వివాహం కేసులో ఇమ్రాన్‌తో పాటు ఆయన భార్య బుష్రా బీబీకి ఏడేళ్ల పాటు జైలు శిక్షతో పాటు ఐదు లక్షల పాకిస్థానీ రూపాయల జరిమానా కూడా విధించారు.

Tags

Read MoreRead Less
Next Story