PAK: పాక్ ప్రభుత్వ రద్దుకు ముహూర్తం ఖరారు...

పాకిస్థాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఐదేళ్ల పాలన గడువు ముగిసేలోపే పాక్ పార్లమెంట్‌ను రద్దు (Dissolve Parliament) చేయనున్నట్లు ప్రకటించింది. ఈ దిశగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్(PM Shahbaz Sharif) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 12 నాటికి తమ ప్రభుత్వ పదవీకాలం పూర్తవుతుందని, కానీ, అంతకుముందే ఆగస్టు 9న(August 9) అధికారం నుంచి దిగిపోతామని(Pakistan's parliament dissolution) షరీఫ్ ప్రకటించారు. ఆపద్ధర్మ ప్రభుత్వానికి పాలనా బాధ్యతలు అప్పగిస్తామని షెహబాజ్ వెల్లడించారు. ఈ క్రమంలో నవంబరులో పాకిస్థాన్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మిత్రపక్షమైన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) నేత ఆసిఫ్ అలీ జర్దారీతో(parliamentary leaders ) భేటీ అనంతరం.. అధికారం నుంచి ముందుగానే వైదొలగాలని పీఎం షెహబాజ్ నిర్ణయం తీసుకున్నారు.
పాక్ రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీని రద్దు చేస్తే 60 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ 5 ఏళ్ల నిర్ణీత గడువుకు ముందే ప్రభుత్వం కూలిపోతే, లేక పార్లమెంట్ ముందే రద్దయితే పాకిస్థాన్ ఎన్నికల సంఘం 90 రోజుల్లోగా సాధారణ ఎన్నికలను నిర్వహిస్తుంది. దీంతో నిర్ణీత కాలానికి ముందే రద్దు చేయడం తమకు కలిసొస్తుందని అధికారంలో ఉన్న PML-Nనేతృత్వంలోని పాకిస్థాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ కూటమి భావిస్తోంది. ఆగస్టు 9వ తేదీన పార్లమెంట్ రద్దుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి ప్రధాని షరీఫ్ పంపనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈనెల తొమ్మిదో తేదీనే పార్లమెంట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నా ఎన్నికల నిర్వహణ(Pakistan's general elections) మాత్రం ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ జనాభా గణన ఫలితాలను అత్యున్నత రాజ్యాంగ సంస్థ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్(Shahbaz Sharif ) అధ్యక్షతన జరిగిన, క్యాబినెట్ మంత్రులు, ప్రావిన్షియల్ ముఖ్యమంత్రులతో పాటు ఇతర సీనియర్ అధికారులు హాజరైన కౌన్సిల్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్ (CCI) సమావేశంలో ప్రణాళికా మంత్రిత్వ శాఖ జన గణన నివేదికను ప్రవేశపెట్టింది. ఈ నివేదిక ప్రకారం పాక్ జనాభా 240.10 మిలియన్లకు చేరుకుందని వెల్లడించింది.
ఈ నెల ఏప్రిల్‌లో నిర్వహించిన జనాభా గణన ఫలితాలను ప్రధాని నేతృత్వంలోని కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ఆమోదం తర్వాత ఎన్నికల నిర్వహణ కోసం పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ECP) కొత్త డీ లిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. దీనికి 90 రోజుల వ్యవధి అవసరమని భావిస్తున్నారు CCI 2023 జనాభా లెక్కలకు ఆమోదం తెలిపితే 2024లో ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీపీ మాజీ కార్యదర్శి కన్వర్ దిల్షాద్ గతంలో చెప్పారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com