Pakisthan: ఆర్ధిక సంక్షోభంలో పాక్... ఆహారం కోసం కటకట..

పాకిస్తాన్ రోజు రోజుకు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ద్రవ్యోల్భణం, ఆర్ధిక సంక్షోభానికి ఇటీవల వచ్చిన వరదలు తోడు కావడంతో పరిస్ధితి మరింత తీవ్రమైంది. ఎంతలా అంటే గోధుమ పిండి కోసం ఏకంగా ఒకరినొకరు కొట్టుకేనే స్ధాయికి చేరింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడి పిండి కోసం జనం ఎగబడుతున్నారు. పలు ప్రాంతాల్లో తొక్కిసలాట, తోపులాటలు సైతం జరుగుతున్నాయి.
మార్కెట్‌లో ఇప్పటికే సరఫరాలో తక్కువ ఉన్న పిండి బస్తాలను పొందడానికి, ప్రతిరోజూ పదివేల మంది గంటలు పాటు అక్కడ ఎదురుచూస్తున్నారు. మినీ ట్రక్కులు, వ్యాన్‌లలో సాయుధ గార్డులతో కలిసి పిండి పంపిణీ చేస్తున్న సమయంలో వాహనాన్ని చుట్టూ ముట్టిన ప్రజలు గుమిగూడి ఒకరినొకరు తోసుకోవడంతో గందరగోళాలు ఎక్కువైపోతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పిండి వ్యాపారులు- ప్రజల మధ్య అనేక ఘర్షణలు వెలుగులోకి వచ్చాయి. కేవలం గోధుమలే కాదు ఉల్లిపాయలు, ధాన్యాలు, బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కిలో ఉల్లిపాయల ధర 2022 జనవరిలో రూ.36 ఉంటే, 2023 జనవరి 5 నాటికి ఏకంగా రూ. 220కు చేరింది. అంటే సంవత్సరంలోనే 501 శాతం పెరిగింది.
ఇక పాక్ ప్రధాన ఆహారమైన గోధుమలు, గోధుమ పిండి ధర విపరీతంగా పెరిగిపోయింది. 15 కిలోల బ్యాగ్ ధర రూ. 2 వేలు దాటింది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారడం ఖాయమని సంకేతాలు అందుతున్నాయి. గోధుమ నిల్వలు పూర్తిగా ఖాళీ అవ్వగా, రష్యా నుంచి గోధుమలు పాకిస్తాన్‌కు చేరుకోవడం కొంత ఊరట కలిగిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com