Pakisthan: పాక్‌లో 37 పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు వాయిదా

Pakisthan: పాక్‌లో 37 పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు వాయిదా
X
పాకిస్థాన్‌లోని వివిధ హైకోర్టుల ఆదేశాల మేరకు పీటీఐ చట్టసభ సభ్యులు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానాలు

పాకిస్థాన్‌లో ఖాళీ అయిన 37 పార్లమెంట్‌ స్థానాలకు జరగాల్సిన ఎన్నికలను ఛీఫ్‌ ఎలక్షన్‌ కమీషన్‌ నిలిపేసింది. పాక్‌లోని వివిధ హైకోర్టుల ఆదేశాల మేరకు పీటీఐ చట్టసభ సభ్యులు రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. అయితే పాక్‌ ఎన్నకల సంఘం తొలుత మార్చి 16న 33స్థానాలకు, మార్చి 19న మరో 31స్థానాలకు ఎన్నికలు ఖరారు చేసింది. కాగా బలూచిస్థాన్‌, పెషావర్‌, సింధ్‌ హైకోర్టులు తమతమ ప్రావిన్స్‌లలో ఉపఎన్నికలను నిలిపేశాయి. దీనికి పర్యావసానంగా ఎన్నికల సంఘం ఆదివారం నాలుగు వేర్వేరు నోటిఫికేషన్‌లను జారీ చేసింది.

Tags

Next Story