Pakisthan: జౌళి పరిశ్రమ కుదేలు.. రోడ్డున పడ్డ 7 కోట్ల మంది ఉద్యోగులు

Pakisthan: జౌళి పరిశ్రమ కుదేలు.. రోడ్డున పడ్డ 7 కోట్ల మంది ఉద్యోగులు
ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో విఫలం

పాకిస్థాన్‌ లో నెలకొన్న ఆర్ధిక సంక్షోభానికి జౌళి పరిశ్రమ బలైంది. ఎగుమతుల గణణీయంగా పడిపోవడంతో సుమారు 7 కోట్ల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనంటూ జౌళి పరిశ్రమ సంబంధిత సంఘాలు మండిపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం వద్ద ఎలాంటి విధి విధానాలు కూడా లేవని ఆక్రోశిస్తున్నాయి.


జౌళి పరిశ్రమకు అవసరమైన ముడిసరుకులు అందకుండా పోతున్నాయి. దీంతో ఇప్పటికే చాలా యూనిట్లు మూతపడడంతో టెక్స్‌టైల్‌ రంగం మూతపడే దశకు చేరుకుందని, మరికొందరు తమ సంస్థలను మూసి వేయాలని లేదా వేరే దేశాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోతున్నారు.

ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ కేబినెట్ సభ్యుల కోసం ప్రభుత్వం ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లను కొన్న వైనాన్ని సంఘం నేతలు తప్పుబడుతున్నారు. కొత్త కార్లు కొనడం వల్ల విదేశీ మారక ద్రవ్య ఆదాయానికి ప్రయోజనం ఉండదని తెలిపారు. దేశానికి ఎలాంటి పన్నులు కట్టక పోగా, ప్రజల ఉపాధి అవకాశాలకు గండికొడుతున్నారని వాపోతున్నారు.


గత తొమ్మిది నెలల్లో ప్రభుత్వ పనితీరు అధ్వాన్నంగా ఉందని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ సమయంలో ఇద్దరు ఆర్థిక మంత్రులు ఉన్నప్పటికీ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించలేకపోతున్నారని, ఎగుమతిదారులను కలవడానికి ప్రధానమంత్రి కానీ ఆర్థిక మంత్రి కానీ సమయం కేటాయించడంలేదని సంఘం నేతలు పేర్కొంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story