Odisha: మతపరమైన ఊరేగింపులో 'పాలస్తీనా తరహా' జెండా కలకలం

పాలస్తీనా జెండాను పట్టుకుని బైకుపై తిరిగారు ఆరుగురు మైనర్లు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనపడడంతో ఆ ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఆ ఆరుగురు బాలురు రెండు బైకులపై ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు కర్ణాటకలోని చిక్కమగళూరు పట్టణంలోని దంటారామక్కి రహదారిపై ఈ ఘటనకు పాల్పడ్డారు.
అంతేగాక పాలస్తీనాకు స్వేచ్ఛకావాలంటూ వారు నినాదాలు చేశారు. ముగ్గురు బాలురు ఓ బైకుపై, మరో బైకుపై మరో ముగ్గురు బాలురు రోడ్లపై తిరిగారు. మొదటి బైకుపై కూర్చున్న 17 ఏళ్ల ఓ బాలుడి చేతిలో పాలస్తీనా జెండా ఉంది. దాని అతడు ఊపుతూ ఉండగా వారు ఆరుగురు నినాదాలు చేశారు.
“ఈ ఘటనలో ఆరుగురు అబ్బాయిలను మేము అదుపులోకి తీసుకున్నాము. ఆ ఆరుగురూ మైనర్లే. మత సామరస్యానికి భంగం కలిగించిన కేసు సహా భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. జెండాతో పాటు రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నాము” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
విచారణ సమయంలో ఆ ఆరుగురు మైనర్లు ఓ ఆసక్తికర విషయం తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో కొందరు పాలస్తీనా జెండాలను ప్రదర్శించారని, వాటికి సంబంధించి కొన్ని వీడియోలను తాము చూశామని, తాము కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి రీల్‌ను రూపొందించాలనుకుంటున్నామని ఆ మైనర్లు తెలిపారు.
మరోవైపు ‘‘పాలస్తీనా జెండాలో మాదిరిగానే మూడు రంగులు ఉన్నాయని, అయితే పాలస్తీనా జెండాలో ఉండే త్రిభుజం లేదని, ఆ స్థానంలో ఏదో రాసి ఉందని, కాబట్టి ఇది పూర్తిగా పాలస్తీనా జెండాను సూచించే విధంగా లేదు’’ అని పోలీస్ అధికారి వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com