Snakes: ప్యాంటులో పాములు..

ప్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది గుర్తించారు. గత నెల 26న ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతని ఫ్యాంటులో ఉన్న ఓ చిన్నపాటి సంచిలో పాములను గుర్తించారు. కళ్లద్దాలు (షేడ్స్) దాచుకునే సంచిలా ఉన్న వస్తువు నుంచి రెండు తెల్ల పాములను స్వాధీనం చేసకున్నారు. అనంతరం వాటిని ఫోరిడా మత్స్య, ఫ్ప్రాణి సంరక్షణ కమిషన్ అప్పగించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ మేరకు ట్రాన్స్‌పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌లో పోస్టు చేసింది.
అసలు ఎలా దొరికాడంటే.. ప్రయాణికుడు ఓ సంచిలో రెండు తెల్లటి పాములను ఉంచి.. ఆ సంచిని ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. వాటిని ఎవరూ గుర్తించకుండా తరలించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అమెరికాలోని మయామీ ఎయిర్ పోర్టుకు వచ్చాడు. ఎయిర్ పోర్టు సిబ్బంది సదరు వ్యక్తిని తనిఖీ చేస్తున్న సమయంలో జేబులో ఏదో కదలాడుతున్నట్లు గుర్తించారు. అతన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. ప్యాంటు జేబులోని కళ్లద్దాలు దాచుకునే సంచిలా ఉన్న వస్తువును గుర్తించారు. దానిని స్వాధీనం చేసుకున్న ఎయిర్ పోర్టు సిబ్బంది.. అందులో ఏముందోనని తనిఖీ చేసేందుకు సంచిని విప్పగా.. అందులో రెండు తెల్ల పాములు ఉన్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని అనంతరం.. రెండు పాములను ఫోరిడా మత్స్య, ఫ్ర్పాణి సంరక్షణ కమిషన్ కు అప్పగించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఘటన వివరాలను ట్రాన్స్ ఫోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్ఏ) ఎక్స్ (ట్విటర్) లో పోస్టు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com