పళ్ళకోసం పళ్ళు రాలిపోయేలా కొట్టుకున్నారు

పళ్ళకోసం పళ్ళు రాలిపోయేలా కొట్టుకున్నారు
మామిడి పళ్ళ కోసం మహా యుద్ధం

ఏదన్నా ఒక వస్తువు విరివిగా దొరికేటప్పుడు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు కానీ అదే వస్తువు చాలా రేర్ అయిపోతే. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ దొరకదు అన్న సిచువేషన్ ఏర్పడితే. అప్పుడు మొదలవుతుంది దానికోసం పోరాటం.. లండల్ లోని ఓ షాప్ లో అలాంటి పోరాటమే జరిగింది మనుషులు జుత్తులు పట్టుకొని కొట్టుకున్నారు. ఇంతకీ ఆ గొడవ అంత దేనికోసం జరిగిందో తెలుసా .. మామిడి పండ్ల కోసం..

తీయతీయగా పుల్లపుల్లగా ఉండే రకం ఒకటి. తియ్యగా రసాలూరే పండు మరొకటి. జ్యూస్ లా కాకుండా కాస్త గట్టిగా ముక్కలు కొరికితే స్వర్గం కనిపించే రకం వేరొకటి. బంగినపల్లి, సువర్ణరేఖ, తోతాపురి పేర్లు ఏదైనా కావచ్చు గాని పండు మాత్రం అద్భుతం.. అందుకే మామిడి పళ్ళను ఇష్టపడని వారు ఉండరు. మనదేశంలో అయితే

మామిడిపళ్లు విరివిగా దొరుకుతాయి కాబట్టి పర్వాలేదు. కానీ ఇతర దేశాల్లో మామిళ్ళ మామిడిపండ్ల కోసం జనం మొహం వాచిపోతారు. కాస్త మంచి రకం మామిడిపళ్లు కనపడితే చాలు వాటిని కొనడానికి ఉత్సాహం చూపిస్తారు. కానీ డిమాండ్ ఎక్కువై సప్లై తక్కువ అయితే ఏమవుతుంది. షాపులో గొడవవుతుంది ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి వైరల్ అయింది. మామిడి పండ్లను చేజిక్కించుకునేందుకు లండన్లోని ఓ గ్రోసరి స్టోర్ లో గొడవ జరిగింది. కొంతమంది పాకిస్తానీలు మామిడి పండ్లను చేజిక్కించుకునేందుకు ఒకరిపై ఒకరు దాడికి దిగారు చేతికి అందిన వస్తువులతో కొట్టుకునే ప్రయత్నం చేశారు. వీరిలో ఓ మహిళ సైతం వీరచిత పోరాటం చేసింది. గొడవ జరిగే ప్రాంతంలో తడిగా ఉండడంతో ఆ వ్యక్తి అమాంత కింద పడిపోయాడు కూడా. గొడవ ఎలా ముగిసిందో తెలియదు కాని మొత్తానికి మామిడి పళ్ళ కోసం కొట్టుకుంటున్న ఈ వీడియో మాత్రం వైరల్ అయ్యింది.

Tags

Read MoreRead Less
Next Story