పెరూలో మరోసారి బయటపడ్డ మమ్మీల అవశేషాలు

దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ దేశంలో వెయ్యేళ్ల క్రితం నాటి ఐదు మమ్మీల అవశేషాల బయటపడ్డాయి. లిమా నగరంలో క్రీడా మైదానం పక్కనే పురావస్తు శాస్త్రవేత్తలు వీటిని కనుగొన్నారు. మమ్మీల పక్కనే ఇచ్‌మా నాగరికతను సంబంధించిన వస్తువులను శాస్త్రవేత్తలు గుర్తించారు.
పెరూ రాజధాని లిమా శివారులో వెయ్యేళ్ల క్రితం నాటి ఐదు మమ్మిల అవశేషాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఫుట్‌బాల్ క్రీడాకారులకు శిక్షణిచ్చే మైదానం పక్కనే వీటిని గుర్తించారు. ఒకప్పుడు ఈ ప్రదేశంలో మెుక్కలు, చెట్లు ఉండేవని ఓ శాస్త్రవేత్త తెలిపారు. ఐదు మమ్మిలలో నాలుగు మైనర్లవిగా ఒకటి మేజర్‌దిగా గుర్తించారు. ఈ అవశేషాలు వెయ్యి సంవత్సరాల క్రితం నాటివని లూయిస్ తకుడా అనే శాస్త్రవేత్త తెలిపారు. ఈ మమ్మీలు పురాతనమైన ఇచ్‌మా నాగరికతకు చెందినవిగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 1100 శతాబ్దంలో ఏర్పడిన ఇచ్‌మా నాగరికత ప్రస్తుతమున్న లిమా నగరంతో పాటు దాని చుట్టు పక్కల ప్రాంతాలలో కనిపించేది. ఈ ప్రాంతాన్ని ఇన్కా సామ్రాజ్యం పాలించేంది.
మమ్మీల మరణాలకు కారణాలను మాత్రం పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొనలేదు. మమ్మిల అవశేషాల పక్కనే కుండ లాంటి వస్తువులు సైతం బయట పడ్డాయి. ఆ వస్తువులు ఇచ్‌మా నాగరికతను ప్రతిబింబిస్తున్నాయని శాస్త్రవేత్త లూయిస్ తకుడా చెప్పారు. ఈ ఏడాది మెుదట్లో ఫుట్‌బాల్ క్రీడా మైదానం పరిసరాల్లోని కొండ ప్రాంతంలో ఉన్న 8 టన్నుల వ్యర్థాలను అధికారులు తొలగించారు. ఆ సమయంలోనే మమ్మి అవశేషాలు బయటపడటంతో మున్సిపల్ అధికారులు అక్కడ నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించారు. లిమా నగరంలో 400కు పైగా పురావస్తు ప్రదేశాలు ఉన్నాయి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com