Pakistan: పాకిస్తాన్ పెషావర్‌లో బాంబు పేలుడు.. 9 మంది మృతి..

Pakistan: పాకిస్తాన్ పెషావర్‌లో బాంబు పేలుడు.. 9 మంది మృతి..
X
పెషావర్‌లో పోలీసులే లక్ష్యంగా దాడి..

దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌ గురువారం బాంబు పేలుడు కారణంగా 9 మంది మరణించినట్లు, నలుగురు గాయపడినట్లు తెలుస్తోంది. పోలీస్ అధికారులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని పాక్ మీడియా నివేదించింది. ఈ సంఘటన వివరాలను పెషావర్ క్యాపిటల్ సిటీ పోలీస్ ఆఫీసర్ మియాన్ సయీద్ కార్యాలయం ధృవీకరించిందని డాన్ మీడియా తెలిపింది. ఈ సంఘటన తర్వాత పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి.

సెప్టెంబర్ 30న బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో ఫ్రాంటియర్ కార్ప్స్ (FC) ప్రధాన కార్యాలయం సమీపంలో రద్దీగా ఉండే వీధిలో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ దాడిలో 10 మంది మరణించారు. 32 మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ఇప్పుడు పెషావర్‌లో బాంబు దాడి జరిగింది.

Tags

Next Story