Pig Heart | పంది గుండె అమర్చిన రోగి మృతి

Pig Heart | పంది గుండె అమర్చిన రోగి మృతి
ఆర్గాన్ రిజెక్షన్ తలెత్తి రోగి మృతి చెందాడని వైద్యుల వెల్లడి

గుండె ఫెయిల్యూర్‌కు చికిత్సగా జన్యుపరంగా మార్పిడి చేసిన పంది గుండెను అమర్చిన రోగి దురదృష్టవశాత్తు మరణించాడు. 58 ఏండ్ల అమెరికన్‌ లారెన్స్‌ ఫాసెట్టి గుండె ఫెయిల్‌ అవ్వటంతో సెప్టెంబర్‌ 20న యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ వైద్యులు ఆయనకు గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేశారు.

మొదటి నెల రోజులు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నా, ఆ తర్వాత ‘ఆర్గాన్‌ రిజెక్షన్‌’కు గురైందని, 6 వారాల తర్వాత ఆయన మృతి చెందాడని మేరీల్యాండ్‌ వైద్యులు బుధవారం ప్రకటించారు. ఫాసెట్ గుండె పూర్తిగా విఫలం కావడంతో యూనివర్సిటీ ఆఫ్ మెరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు ప్రయోగాత్మకంగా సెప్టెంబర్ 20న ఫాసెట్‌కు ఆపరేషన్ నిర్వహించి పంది గుండె అమర్చారు. మనిషికి అనుకూలంగా జన్యుమార్పిడి చేసిన పంది నుంచి ఈ గుండెను సేకరించారు. కాగా, ఆపరేషన్ జరిగిన తొలినాళ్లల్లో ఫాసెట్ ఆరోగ్యం వేగంగా మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. ఆ తరువాతి రోజుల్లో పంది గుండెను ఫాసెట్ రోగనిరోధక వ్యవస్థ తిరస్కరించడం (ఆర్గాన్ రిజెక్షన్) ప్రారంభించిందని వెల్లడించారు. ఆయనను కాపాడేందుకు తాము ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని విచారం వ్యక్తం చేశారు. గుండె మార్పిడి శస్త్రచికిత్స తరువాత రోగులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఆర్గాన్ రిజెక్షన్ అన్న విషయం తెలిసిందే. ఈ సమస్యను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు అనేక కోణాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు.పంది గుండెను అమర్చిన తర్వాత ఫాసెట్టి వేగంగా కోలుకున్నారు. ప్రపంచంలో ఈ తరహా గుండె మార్పిడి ఆపరేషన్‌ చేసుకున్న రెండో వ్యక్తిగా ఆయన వార్తల్లో నిలిచారు.


సాధారణంగా మనం వ్యక్తుల నుంచి వ్యక్తులకు అవయవ మార్పిడి చేయడం చూస్తూ ఉంటాము. కోవిడ్ తరువాత బ్లెడ్ సెల్స్ మార్పిడి చేయడం వెలుగులోకి వచ్చింది. అయితే ఇటీవల ఒక వ్యక్తికి పంది నుంచి తీసిన గుండెను అమర్చారు. వైద్య చరిత్రలో ఇదో పెద్ద సంచలనంగా ప్రపంచవ్యాప్త చర్చ జరిగింది. ఇలా చేసిన శాస్త్ర చికిత్సలో పంది గుండెతో ఆ వ్యక్తి సుమారు 40 రోజుల పాటూ బతికారు. మిస్టర్. ఫౌసెట్ తన శస్త్రచికిత్స తర్వాత గణనీయమైన పురోగతిని సాధించారు. ఈ ఆపరేషన్ తరువాత కుటుంబ సభ్యులతో సరదాగా గడిపాడు. అతని భార్య ఆన్‌తో కలిసి పేకాట కూడా ఆడాడు. ఇటీవలి రోజుల్లో, అతని గుండె సర్జరీలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. ఇందులో భాగంగా కొన్ని ప్రారంభ సంకేతాలను చూపించింది. సుదీర్ఘ అనుభవం ఉన్న వైద్య బృందం గొప్ప ప్రయత్నం చేసినప్పటికీ మిస్టర్ ఫౌసెట్ చివరికి అక్టోబర్ 30న మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇలా మరణించిన వ్యక్తి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో అపారమైన అనుభవంగణించి రిటైర్డ్ అయిన ల్యాబ్ టెక్నీషియన్ . అతను మేరీల్యాండ్ ఆసుపత్రికి వచ్చినప్పుడు ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా సాంప్రదాయ గుండె మార్పిడి కోసం ప్రయత్నించి నిరాశ చెందాడు. దీంతో మనిషికి అనుకూలంగా జన్యుమార్పిడి చేసిన పంది నుంచి ఈ గుండెను సేకరించారు.


Tags

Read MoreRead Less
Next Story