మోదీ మెనూ చూద్దాం రండి

ప్రధాని మోదీకి వైట్ హౌస్ లో అదిరిపోయే శాఖాహార విందు

అమెరికా తిండంతా బర్గర్లు పిజ్జాల తంతు. ఏ రెస్టారెంట్ కి వెళ్ళిన వెజ్ తినాలంటే వెతుక్కోవాల్సిందే. ఫ్రెంచ్ ఫ్రైస్ తప్ప ఇంకేది ఫ్రీక్వెంట్ గా దొరకవు. సలాడ్ లో కూడా వెజ్ మాత్రమే ఉందా ఇంకేదైన్నా కలిసిందా అనేది చూసి చూసి తినాలి. మన ఇండియన్ రెస్టారెంట్ వెతుక్కొని వెళ్తే మాత్రం అక్కడ మంచి ఫుడ్ లభించే అవకాశం ఉంది. ఇదంతా ఒకే.. మోడీ అమెరికాలో ఏం తినబోతున్నారు.

ఎందుకంటే మోది కూడా వెజ్ కాబట్టి. అందుకే అమెరికా ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బిడెన్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఇచ్చే స్టేట్ డిన్నర్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రధాని కోసం స్పెషల్ గా శాఖాహార మెనూని ప్రకటించారు.

కాలిఫోర్నియాకు చెందిన ఒక ప్లాంట్ - బేస్డ్ చెఫ్ నినా కర్టిస్, వైట్ హౌస్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ క్రిస్ కామెర్ ఫోర్డ్, వైట్ హౌస్ ఎగ్జిక్యూటివ్ పేస్ట్రీ చెఫ్ సూసీ మోరిసన్ తో కలిసి ఆమె మెనూను డిజైన్ చేశారు.అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరాన్ని జరుపుకునే ప్రయత్నాలకు భారతదేశం నాయకత్వం వహిస్తోంది కాబట్టి మ్యారినేటెడ్ చిరుధాన్యాలను మెనూలో చేర్చామన్నారు.

ఈ మెనూ ను మూడు కోర్సులుగా డిజైన్ చేశారు.

మొదటి కోర్సులో మేరీల్యాండ్ సిల్వర్ కార్న్, పుచ్చకాయతో కూడిన మ్యారినేటెడ్ మిల్లెట్ సలాడ్ పేరుతో చిరుధాన్యాలను హైలైట్ చేశారు. ఇందులో టాంగీ అవోకాడో సాస్ డిప్పింగ్ కి ఇవ్వానున్నారు.

ఇక రెండవ కోర్సులో అంటే మెయిన్ కోర్స్ లో స్టఫ్డ్ పోర్టోబెల్లో మష్రూమ్స్ ముఖ్యమైనవి. ఇందులో ఎండిన టమోటాలు, లీక్స్, ఇతర మూలికలు ఉంటాయి. రిసోటో కుంకుమపువ్వుతో నిండి ఉంటుంది. ఇది ప్లాంట్- బేస్డ్ కాబట్టి, రుచులు, ఆకృతులు ఏవీ మిస్ కావని చెఫ్ చెబుతున్నారు.

మూడో కోర్సులో అంటే డిజర్ట్. గులాబీ, యాలకులు కలిపిన స్ట్రాబెర్రీ షార్ట్ కేక్స్ ఉంటాయి. డైనింగ్ టేబుల్ అంతా కాషాయ రంగు పువ్వులతో అలంకరిస్తారు. భారత జాతీయ పతాకంలోని 3 రంగుల పూలతో ఈ అలంకరణ ఉంటుంది. డిన్నర్ తరువాత గ్రామీ అవార్డు విజేత జోషువా జెల్ వేసవి స్క్వాష్, సంగీత కార్యక్రమం ఉంది.

Tags

Next Story