PM Modi : థాయ్‌లాండ్ నూతన ప్రధాని షినవత్రాకు మోదీ శుభాకాంక్షలు

థాయ్‌లాండ్ మాజీ ప్రధాని థాక్సిన్ కుమార్తె పెటోంగ్‌టార్న్ షినవత్రా ఆ దేశ నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు. థాయ్‌లాండ్పార్లమెంట్ ఆమెను ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. 37 ఏళ్ల వయస్సులో ప్రధాని అయిన ఆమె.. దేశంలో ప్రధాని పదవి చేపట్టిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం థాయ్ నూతన ప్రధానికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో విజయవంతంగా మీ పదవీకాలం నిర్వహించాలని ఆకాంక్షించారు. దీంతోపాటు భారతదేశం, థాయ్‌లాండ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామని చెప్పారు.
షినవత్రా విజయవంతంగా తన పదవీకాలం నిర్వహించాలని ఆకాంక్షించారు. భారత్, థాయ్‌లాండ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, తమతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. పెటోంగ్‌టార్న్ షినవత్రా కంటే ముందు ఆమె అత్త యింగ్లక్ కూడా థాయ్‌లాండ్ ప్రధానిగా పనిచేశారు. ఆమె తర్వాత థాయ్‌లాండ్ ప్రధాని పదవి చేపట్టిన రెండో మహిళ పెటోంగ్‌టార్న్ కావడం గమనార్హం.
థాయ్‌లాండ్ ప్రధాని శ్రేతా తవిసిన్‌ను ఇటీవల రాజ్యాంగ న్యాయస్థానం తొలగించింది. ఆ తర్వాత రెండు రోజులకు షినవత్రా ప్రధానిగా ఎంపికైంది. ఇద్దరూ ఫ్యూ థాయ్ పార్టీకి చెందినవారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com