PM Modi: ప్రధాని మోడీకి మారిషన్ అత్యున్నత పురస్కారం..

PM Modi: ప్రధాని మోడీకి మారిషన్ అత్యున్నత పురస్కారం..
X
మారిషస్‌ అధ్యక్షుడికి గంగాజలాన్ని అందజేసిన ప్రధాని మోదీ

మారిషస్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీకి, ఆ దేశ అత్యున్నత గౌరవం లభించింది. పీఎం మోడీకి ‘‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆప్ ది ఇండియన్ ఓషియన్’’తో సత్కరించింది. మారిషన్ ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గులం మంగళవారం ప్రధాని నరేంద్రమోడీకి ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ప్రధాని మోడీకి ఇది 21వ అంతర్జాతీయ అవార్డు. మారిషస్ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయులు కూడా ప్రధాని మోడీనే. ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం మారిషస్ వెళ్లాడు. పోర్ట్ లూయిస్‌లో జరిగిన ఇండియన్ కమ్యూనిట కార్యక్రమంలో రామ్‌గులం ఈ ప్రకటన చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మారిష‌స్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. తన పర్యటనలో భాగంగా మారిషస్‌ అధ్యక్షుడు ధరమ్‌ గోకూల్‌ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గోకూల్‌కు అపురూప కానుక ఇచ్చారు. మహాకుంభమేళా నుంచి తీసుకెళ్లిన పవిత్ర గంగాజలాన్ని బహుమతిగా అందజేశారు. గంగాజలంతోపాటు ఇతర బహుమతులు కూడా ఇచ్చారు. అంతకుముందు మారిషస్‌ ప్రధాని డాక్టర్ న‌వీన్‌చంద్ర రామ్‌గూల‌మ్‌తో మోదీ భేటీ అయ్యారు.

కాగా, రెండు రోజుల ప‌ర్యట‌న‌లో భాగంగా ఇవాళ ప్రధాని మోదీ మారిష‌స్ చేరుకున్న విషయం తెలిసిందే. రేపు జరిగే మారిషస్‌ 57వ జాతీయ దినోత్సవానికి ప్రధాని గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేప‌థ్యంలో క‌వాతు ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో భార‌తీయ సైనిక ద‌ళాలు పాల్గొంటున్నాయి. భార‌తీయ నౌకాద‌ళ యుద్ధ విమానంతో పాటు వైమానిక ద‌ళానికి చెందిన ఆకాశ గంగా స్కై డైవింగ్ బృందం పాల్గొన‌నుంది. హిందూ మ‌హాస‌ముద్రంలో ఉన్న మారిష‌స్‌తో భార‌త్‌కు గాఢ‌మైన బంధం ఉన్నది. ఆఫ్రికా ఖండానికి వెళ్లేందుకు మారిష‌స్‌ను గేట్‌వేగా భావిస్తారు. హిస్టరీ, జియోగ్రఫీ, క‌ల్చర్ ద్వారా రెండు దేశాలు క‌నెక్ట్ అయిన‌ట్లు మోదీ తెలిపారు. భార‌తీయ నేవీ, మారిష‌స్ అధికారుల మ‌ధ్య టెక్నిక‌ల్ అగ్రిమెంట్ జ‌ర‌గ‌నున్నది. వాణిజ్యం, సీమాంత‌ర ఆర్థిక నేరాలు, చిన్న‌..మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్రమ‌ల అభివృద్ధి వంటి అంశాల‌పై రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకోనున్నాయి.

Tags

Next Story