PM Modi: ఫుట్‌బాల్ అంటే మాకూ ఇష్టమే: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీ వడోదర పర్యటనలో భాగంగా స్పెయిన్ ప్రధాని సమక్షంలో బార్సిలోనా ఫుట్‌బాల్ జట్టు విజయంపై స్పందించారు. లాలిగా టోర్నీలో భాగంగా రియల్ మాడ్రిడ్, బార్సిలోనా జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో 4-0 తేడాతో బార్సిలోనా విజయం సాధించింది. ఈ విజయంపై ప్రధాని మోదీ స్పందిస్తూ, బార్సిలోనా ఫుట్ బాల్ జట్టుపై ప్రశంసలు కురిపించారు.
"స్పానిష్ ఫుట్‌బాల్ అంటే భారతీయులకు ఇంతగానో ఇష్టం అని వెల్లడించారు. నిన్న జరిగిన రియల్ మాడ్రిడ్, బార్సిలోనా మ్యాచ్ గురించి భారత్ లోనూ చర్చించుకున్నారని తెలిపారు. స్పెయిన్‌లో మాదిరిగానే బారత్‌లోనూ సందడి వాతావరణం నెలకొందని నేను చెప్పగలను అని ప్రధాని మోదీ వడోదర రోడ్‌షోలో ప్రసంగిస్తూ వివరించారు. కాగా, మోదీకి ఫుట్‌బాల్‌పై ఉన్న పరిజ్ఞానం అందరినీ ఆశ్చర్యపరింది.
స్పెయిన్ తో బంధం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ఇద్దరూ కలిసి సోమవారం గుజరాత్‌లోని వడోదరలో టాటా-ఎయిర్‌బస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముందు ఇద్దరూ కలిసి రోడ్ షో నిర్వహించారు. వడోదరా విమానాశ్రయం నుంచి టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్ వరకు 2.5 కి.మీ. మేర సాగిన ఈ రోడ్‌షో లో ఇద్దరు నేతలు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ రోజు (సోమవారం) ఇరుదేశాధి నేతలు చారిత్రాత్మకమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో ద్వైపాక్షిక భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల నేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ చర్చలు ఇరుదేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని మోదీ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com