Pm Modi: ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి అతిధిగా మోదీ

Pm Modi: ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి అతిధిగా మోదీ
బాస్టిల్ డే ఉత్సవానికి ఆహ్వానించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు

జూలై 14 ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ప్రధానమంత్రి మోడీకి స్వాగతం లభించింది. ఫ్రాన్స్ నేషనల్ డే సందర్భంగా పారిస్ లోని చాంప్స్ ఎలిసిస్ లో బాస్టిల్ డే ఫ్లై పాస్ట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆహ్వానాన్ని మన్నించి మోదీ ఈ కార్యక్రమం కోసం ఫ్రాన్స్ వెళ్లనున్నారు.

ప్రతి ఏడాది జులై 14వ తేదీన ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం నిర్వహిస్తారు. కాగా, ఈ ఏడాది ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి గౌరవ అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని మాక్రాన్ స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. బాస్టిల్ డే ని ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం గా జరుపుకుంటారు. 1789లో పారిస్ ప్రజలు ఆయుధశాల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తీసుకుని రాయల్ ఫోర్ట్ వైపు కవాతు చేసి అక్కడికి ఖైదీలను విడుదల చేశారు. దీనిని ఫ్రెంచ్ విప్లవంలో ఒక మైలు రాయిగా చెబుతారు. అందుకే ఈ కవాతు, సాంస్కృతిక ప్రదర్శనలు, దేశం వ్యాప్తంగా బాణాసంచా కాల్పులతో జాతీయ దినోత్సవం నిర్వహిస్తారు.

ఈ కవాతు కార్యక్రమంలో భారత్ కు చెందిన 3 రాఫెల్ యుద్ధ విమానాలు కూడా పాల్గొంటున్నాయి. నిజానికి

రాఫెల్ యుద్ధ విమానాలను భారత్... ఫ్రాన్స్ నుంచే కొనుగోలు చేసింది. అందుకే ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా జరిగే సైనిక కవాతులో ఈ మూడు రాఫెల్ యుద్ధ విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే భారత రక్షణ శాఖ అధికారులు ధ్రువీకరించారు. అంటే బాస్టర్ డే రోజున జరిగే కవాతులో భారత సైనిక బృందం కూడా భాగం కానుంది.

గత వారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా ఈజిప్ట్ దేశాల్లో పర్యటించారు. అమెరికా స్టేట్ విజిట్ లో మోడీకి అక్కడి ప్రజలు, ప్రభుత్వం బ్రహ్మరథం పట్టారు. అమెరికా ఉపయసభల సంయుక్త సమావేశంలో ప్రధాని మాట్లాడారు. అమెరికా అధ్యక్షులు బైడన్ దంపతుల ఆహ్వానం మేరకు వైట్ హౌస్ లో జరిగిన విందులో పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఇరుదేశాల మధ్య రక్షణ, శాస్త్ర, సాంకేతిక రంగాలలో వివిధ ఒప్పందలు జరిగాయి ఆ తర్వాత ఈజిప్టు పర్యటనలో మోడీ అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది నైల్ ను స్వీకరించారు.

Tags

Read MoreRead Less
Next Story