వైట్ హౌస్ లో మోదీ... అధ్యక్షుడిపై కానుకల వర్షం

వైట్ హౌస్ లో మోదీ... అధ్యక్షుడిపై కానుకల వర్షం
బహుమతులు ఇచ్చి పుచ్చుకున్న మోదీ, బైడెన్

అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌ డీసీలోని అధ్యక్ష భవనం వైట్‌ హౌజ్‌కు చేరుకున్నారు ప్రధాని మోదీ. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌, ప్రథమ మహిళ బిల్‌ బైడెన్‌లు మోదీని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆ దంపతుల ఆతిథ్యం స్వీకరించారాయన. శ్వేత సౌధానికి మోదీ వెళ్లే సమయంలో చిరుజల్లు కురుస్తున్నాయి అయినప్పటికీ ఎంతో మంది ఇండో అమెరికన్లు మోడీ కోసం వేచి ఉన్నారు దీంతో మోడీ ట్విట్టర్లో స్పందించారు వాషింగ్టన్ డీసీ లో భారతీయుల ఆత్మీయ స్వాగతం లభించింది, దేవుడి ఆశీస్సులతో సహా అని ట్వీట్ చేశారు. దేశ అధ్యక్షుడు జో బైడెన్‌, ఆయన భార్య బిల్‌ బైడెన్ లతో సరదా, కబుర్లతో పాటు ప్రపంచ పరిణామాలపైనా చర్చించారు. అనంతరం విందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోదీకి జో-జిల్ బిడెన్‌లు కానుకలు సమర్పించారు. 20వ శతాబ్ద ప్రారంభపు కాలానికి చెందిన పురాతన అమెరికన్ బుక్ గ్యాలీని ఆ దంపతులు కానుకగా ఇచ్చారు. ఇది చేతితో తయారు చేసిన పుస్తకం.

అలాగే బైడెన్‌ పర్సనల్‌గా మోదీకి పాతకాలపు ఓ అమెరికన్ కెమెరాను బహుమతిగా ఇచ్చారు. దానితో పాటుగా జార్జ్ ఈస్ట్‌మన్ మొదటి కొడాక్ కెమెరా పేటెంట్ ఆర్కైవల్ ఫాక్సిమైల్ ప్రింట్, అమెరికన్ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ హార్డ్ కవర్ పుస్తకాన్ని కూడా బహుమతిగా ఇచ్చారు. ఇక ఆయన భార్య జిల్ బైడెన్ ప్రధాని మోదీకి రాబర్ట్ ఫ్రాస్ట్ కవితల సంకలన సంతకం మొదటి ఎడిషన్ కాపీని బహుమతిగా ఇచ్చారు.





ఇక మోదీ కూడా ఆ దంపతులకు కానుకలు ఇచ్చారు. భారత్‌లో అనుబంధం ఉన్న ఐరిష్‌ రచయిత, నోబెల్‌ విన్నర్‌ డబ్ల్యూబీ యేట్స్‌ ‘భారత ఉపనిషత్తుల’ ఆంగ్ల తర్జుమా కాపీని బైడెన్‌కు భారత ప్రధాని మోదీ కానుకగా ఇచ్చారు. ఇక అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని అంటే గ్రీన్‌ డైమండ్‌ను బహుమతిగా ఇచ్చారు ప్రధాని. ఈ వజ్రం.. పర్యావరణ అనుకూలమైంది. సోలార్‌, విండ్‌ పవర్‌ లాంటి వనరులను ఉపయోగించి దీనిని రూపొందించారు. అలాగే జైపూర్ రాజస్థాన్ ప్రాంత ప్రజలు చేతితో తయారుచేసిన ఒక గంధపు పెట్టెను, అందులో తరతరాలుగా కోల్ కతా లోని వెండి పని చేసేవారు స్వయంగా తయారు చేసిన ఒక చిన్ని వెండి గణేషుడి విగ్రహాన్ని, దీపపు ప్రమిదను ఇచ్చారు. ఒక శ్లోకం రాసిన పురాతన తామ్ర పత్రాన్ని, వెస్ట్ బెంగాల్ కళాకారులతో రూపొందించిన అతి చిన్న వెండి కొబ్బరికాయను ఇలా ఒక్క ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క వస్తువును బైడెన్ కు అందించారు.

Tags

Read MoreRead Less
Next Story