Poland plane crash: కుప్పకూలిన చిన్న విమానం

పోలాండు దేశ రాజధాని వార్సా సమీపంలో చిన్న విమానం కుప్పకూలిపోయింది. సమీపంలోని ఎయిర్‌ఫీల్డ్ వద్ద చిన్న విమానం హ్యాంగర్‌లోకి దూసుకెళ్లి ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో కనీసం ఏడుగురు గాయపడ్డారని పోలాండ్ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఆడమ్ నీడ్జిల్స్కీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
వార్సా నుంచి 47 కిలోమీటర్లు దూరంలో ఉన్న క్రిసిన్నో గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన వారిలో నలుగురు ప్రయాణికులు కాగా ఒకరు పైలట్. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. విమాన ప్రమాదం జరిగిన ప్రదేశానికి నాలుగు హెలికాప్టర్లు, 10 అంబులెన్స్‌లను పంపించినట్లు నీడ్జీల్స్కీ చెప్పారు. వాతావరణం అనుకూలించకపోవడంతోటే విమానం కూలినట్లుగా సమాచారం. కుప్పకూలిన విమానం సెస్నా 208 అని పోలాండ్ మీడియా పేర్కొంది. విమానం యొక్క తోక హ్యాంగర్‌లో నుంచి బయటకు వచ్చినట్లు చూపించే ఫోటోను స్థానిక అగ్నిమాపక విభాగం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com