అంతర్జాతీయం

అకౌంట్లో కోట్లు.. అయినా యాచిస్తూ..

బిక్షాటన చేస్తున్న ఓ మహిళను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు.

అకౌంట్లో కోట్లు.. అయినా యాచిస్తూ..
X

తను తినడు.. ఒకళ్లకి పెట్టడు.. పోయేటప్పుడు ఏం కట్టుకుపోతాడో.. డబ్బున్న పిసినారి వ్యక్తిని గురించి తెలిసిన వారు అనుకునే మాటలు.. సరే తినకపోయినా, పెట్టకపోయినా పర్లేదు.. కానీ ఈ అడుక్కోవడం ఏమిటో.. అదీ అబద్దం చెబుతూ, దివ్యాంగురాలిగా నటిస్తూ.. ఆ విసయమే ఆలోచనలో పడేసింది ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులకు. ఈజిప్టులో బిక్షాటన చేస్తున్న ఓ మహిళను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు.

కాళ్లు బాగానే ఉన్నా వీల్‌ఛైర్‌లో కూర్చుని మరీ యాచిస్తోంది.. సాయింత్రం కాగానే వీల్‌ఛైర్ పక్కన పెట్టేసి నడుచుకుంటూ వెళ్లడాన్ని స్థానికులు గమనించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దాంతో ఆమెని విచారించిన పోలీసులకు తనకు పక్షవాతం వచ్చి ఒక కాలు కోల్పోయానని చెప్పింది. ఆమె అబద్దం చెబుతుందని భావించి మరింత లోతుగా విచారణ జరిపించారు పోలీసులు. దాంతో ఆమెకు ఎలాంటి అనారోగ్యం లేదని, పైగా గర్బియా, ఖలిబుయా, గవర్నరేట్స్‌లో ఐదు భవనాలు ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.

అంతే కాదు, ఆమెకు చెందిన రెండు బ్యాంక్ ఖాతాల్లో 3 మిలియన్ ఈజిప్షియన్ పౌండ్స్ (దాదాపు రూ.1.42 కోట్లు) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.. కోటీశ్వరురాలై ఉండి ఆమెకు యాచించవలసిన అగత్యం ఏమొచ్చిందనే దానిపై పోలీసులు దృష్టి పెట్టారు. విచారణ అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు.

Next Story

RELATED STORIES